2021 Rewind: సక్సెస్‌ఫుల్ సినీ ఎంట్రీ.. వచ్చి రాగానే వెండితెరపై సత్తాచాటిన హీరోలు వీరే.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Wednesday, 29 December 2021

demo-image

2021 Rewind: సక్సెస్‌ఫుల్ సినీ ఎంట్రీ.. వచ్చి రాగానే వెండితెరపై సత్తాచాటిన హీరోలు వీరే..

Responsive Ads Here
photo-88562313
సినిమా అనే రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప అవకాశాలు తలుపుతట్టవు. అయితే కొందరు హీరోలకు తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు కాస్త టైం పట్టినా కొందరు హీరోలు మాత్రం తొలి సినిమాతోనే తమ మార్క్ చూపెడుతుంటారు. మరి ఈ ఏడాది (2021)లో అలాంటి హీరోలు ఎవరు? వారి వారి సినిమాలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ఓ లుక్కేద్దామా.. ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ చేస్తూ ప్రతి ఇంటి సభ్యుడికి సుపరిచితమైన యాంకర్ ప్రదీప్ ఈ ఏడాదే హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెండితెరపై కూడా తన టాలెంట్ చూపించిన ప్రదీప్.. ఈ ఏడాది ఆరంభంలోనే హీరోగా వెండితెరపై కాలుమోపారు. ఆయన హీరోగా కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోగా తొలి సినిమాతోనే ప్రదీప్ టాలెంట్ బయటపడిందనే టాక్ వచ్చింది. వైష్ణవ్ తేజ్ మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా బలమైన బ్యాక్‌గ్రౌండ్‌తో వెండితెరపై కాలు మోపిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. తన తొలి సినిమా 'ఉప్పెన'తో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన నటన చూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. సుకుమార్ శిష్యులు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. రోషన్ మేక హీరో శ్రీకాంత్ తనయుడిగా సినీ గడప తొక్కిన రోషన్ మేక పెళ్లి సందD సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలవడమే గాక రోషన్ నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కెరీర్ పరంగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కారు రోషన్. కమెడియన్ సత్య తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య.. 'వివాహ భోజనంబు' సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సందీప్ కిషన్ ఈ సినిమాను నిర్మించాడు తేజ సజ్జ సినిమాల పరంగా, నటన పరంగా మంచి అనుభవమే ఉన్న తేజ సజ్జ తొలిసారి హీరోగా జాంబీ రెడ్డి సినిమాతో కెమెరా ముందుకొచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది. చిత్రంలో తేజ సజ్జ నటనకు మంచి మార్కులు పడ్డాయి.


from https://ift.tt/3mFj4Vm

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages