‘రామ్.. ట్వీట్లు కాదు బెజవాడొచ్చి ప్రెస్ మీట్ పెట్టు, ఎవడొస్తాడో చూస్తా’.. ట్వీట్ ‘కుల’కలం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday 22 August 2020

‘రామ్.. ట్వీట్లు కాదు బెజవాడొచ్చి ప్రెస్ మీట్ పెట్టు, ఎవడొస్తాడో చూస్తా’.. ట్వీట్ ‘కుల’కలం

స్వర్ణ ప్యాలెస్ ఇష్యూలో చేసిన ట్వీట్లు దుమారం.. సినీ, రాజకీయ వర్గాల్లో ఇంకా చల్లారడం లేదు. ఇక ఈ ఇష్యూలో తాను ట్వీట్లు చేయాలనుకోవడం లేదని రామ్ చెప్పినా.. అధికార ప్రతిపక్షాలు ఇష్యూని ఇక్కడితో వదలడం లేదు. విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు హీరో రామ్ పేరుని ప్రస్తావించడంతో ఈ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడగా.. స్వర్ణా ప్యాలెస్ ఇష్యూ రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య మాటల తూటాలు పేల్చుకోవడానికి వేదిక అయ్యింది. అయితే తాజాగా ఇష్యూపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. హీరో రామ్ ట్వీట్లు ఆపొద్దని.. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెరమీదే కాదు రియల్ లైఫ్ హీరో అనిపించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ ప్యాలెస్ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రమేష్‌ తప్పుచేయలేనప్పుడు దాకోవడం ఎందుకు? బయటకు రావాలి.. మహా అయితే అరెస్ట్ చేసి జైలులో పెడతారు.. ఎన్నాళ్లు జైలులో పెడతారో చూద్దాం.. ఎందుకు భయపడాలి.. 18 నెలలు జైలులో ఉండి వచ్చిన సీఎం గారు రాష్ట్రాన్ని ఏలుతుంటే ఏ తప్పూ చేయని మనం ఎందుకు భయపడాలి. సినిమా హీరో రామ్ ఈ ఇష్యూపై ట్వీట్ చేస్తే.. పోలీసులు నోటీసులు ఇస్తాం.. అరెస్ట్ చేస్తాం అని బెదిరిస్తారా?? ఏందయ్యా ఇది ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా..? రాక్షసుల పాలనలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదా?? ఈ సందర్భంగా నేను హీరో రామ్‌గారికి విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు రండి.. ట్వీట్లు ఇంకా పెట్టండి.. మీ అభిప్రాయాల్ని తెలియజేయండి ఏం చేస్తారో చూద్దాం.. ఏం విజయసాయి రెడ్డి ట్వీట్లు పెట్టడం లేదా?? ఆయన స్థాయి దిగజారి ఎదుటివారిని కించపరుస్తూ ట్వీట్లు పెట్టడం లేదా?? ఆయనపై చర్యలు తీసుకుంటున్నారా?? రామ్ ట్వీట్ చేసేసరికి చర్యలు తీసుకుంటారా?? నోటీసులు ఇస్తారా?? కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా?? రామ్ గారూ.. మీరు హీరో.. అది మరిపోవద్దు. సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోగా ఉండాలంటే.. రండి ఎవడొస్తాడో చూద్దాం.. విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి.. వీళ్లు ఏం చేస్తారో.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం’ అంటూ ఆవేశంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్. అయితే ఇష్యూపై తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందిస్తూ.. తనకు ఏమైనా జరిగితే దాన్ని కులానికి ఆపాదించడం చంద్రబాబుకి అలవాటు.. రామ్ సినిమాలు కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా అంటూ కౌంటర్ ఇచ్చారు వంశీ. కుల రాజకీయాలు చేయడం చంద్రబాబుకి బాగా అలవాటు.. మేం కమ్మవాళ్లం కాబట్టి అమ్మఒడి ఇతర పథకాలు ఇవ్వలేదని రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఒక్కర్నైనా చూపించగలరా?? ఈ కులంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు.. చాలామంది ఉన్నారు. చంద్రబాబుతోనే ఈ కులం పోదు.. తరువాత కూడా ఉంటుంది. కమ్మవాళ్లపై వివక్ష ఉందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హీరో రామ్‌ని అనవసరంగా ముందుకు లాగుతున్నారు.. రామ్ సినిమాలు కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా?? వేరేవాళ్లు ఎవరూ చూడొద్దా..? రామ్ ఆ మాట చెప్పమనండి.. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.. నిజానికి చంద్రబాబుతోనే కమ్మ సామాజిక వర్గానికి ముప్పు. ఈ హింసలు ఆయన వల్లే.. తన సమస్యల్ని కులంపై రుద్దుతాడు. గతంలో రాజధాని ఇష్యూలో ఇలాగే చేశారు.. పదేళ్లు ఉమ్మడి రాజధాని అంటే.. అక్కడ ఉండటానికి వీళ్లేదని నాలాంటి వాళ్లని కట్టుబట్టలతో తీసుకువచ్చేశాడు. ఆ తరువాత ఆయన రూ.400 కోట్లతో అక్కడ ఇళ్లు కట్టుకుని ఇప్పుడు రూమూ.. జూమూ అంటున్నారు’ అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు వల్లభనేని వంశీ.


from https://ift.tt/3l7lWYF

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages