సైఫ్‌ అలా చేస్తే నాకు నచ్చదు: కరీనా కపూర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Monday, 23 September 2019

demo-image

సైఫ్‌ అలా చేస్తే నాకు నచ్చదు: కరీనా కపూర్

Responsive Ads Here
photo-71255425
బాలీవుడ్ బ్యూటీ ఇటీవల తన 39వ పుట్టినరోజు జరుపుకొన్నారు. తన భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైమూర్ అలీ ఖాన్, సోదరి కరిష్మా కపూర్, ఇతర బంధువులు, స్నేహితులతో కలిసి పటౌడీ ప్యాలెస్‌లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకున్నారు. అయితే ఇటీవల తన భర్త సైఫ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని కరీనా ఓ చాట్ షోలో పంచుకున్నారు. ‘సైఫ్‌కు ఉన్న ఒక అలవాటంటే నాకు అస్సలు నచ్చదు. నేను ఏం చెప్పినా ముందు నో అంటారు. ఆ తర్వాత ఓకే అనుకుంటూ వస్తారు. సైఫ్.. మనం బయటికి వెళ్దామా? అని అడిగితే.. నో అనేస్తారు. సైఫ్ సోఫాకు వేరే కవర్ మార్పించనా? అని అడిగితే నో అంటారు. ఒక మూడు గంటలు ఆగిన తర్వాత ‘అవును సోఫాకు కొత్త కవర్ వేయించు’ అని చెప్తారు. మరి నేను అడిగినప్పుడు నో అని ఎందుకు చెప్తారు అని ఆయనపై కోపడుతుంటాను. ఇక సాయంత్రం వేళల్లో సైఫ్ ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూ ఉంటారు. ఇల్లంతా క్యాండిల్స్‌ వెలుగుతో నిండిపోయి ఉంటుంది. మేం తొందరగా డిన్నర్ ముగించేస్తుంటాం. వారంలో మూడుసార్లు మనమే వంట చేద్దామని అంటుంటారు. అయితే మేం ఫిలిం పార్టీలకు వెళ్లం. మాకు నచ్చదు. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు’ అని వెల్లడించారు కరీనా. ఇటీవల కరీనా ‘అంగ్రేజీ మీడియం’, ‘గుడ్ న్యూస్’ సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లను ముగించేసుకున్నారు. త్వరలో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తఖ్త్’ సినిమాలో నటిస్తారు ప్రస్తుతం ఆమె ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మరోపక్క సైఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో ‘లాల్ కప్తాన్’, ‘జవానీ జానేమన్’, ‘తానాజీ ది అన్‌సంగ్ హీరో’ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తన భర్తతో కలిసి మరో సినిమా చేయాలని అనుకుంటున్నారట కరీనా. పెళ్లికి ముందు సైఫ్, కరీనా ‘కుర్బాన్’, ‘టషన్’ సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లి తర్వాత వీరి నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. తన భర్తతో కలిసి నటించడానికి తనకు ఒక మంచి స్క్రిప్ట్ కావాలని అంటున్నారు కరీనా.


from https://ift.tt/30fXA7D

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages