తమిళ స్టార్ హీరోయిర్.. హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న నటి నయనతార. ఆమె సినిమా విడుదల అవుతుందంటే అభిమానులను థియేటర్ల ఎదుట క్యూ కడతారు. అయితే పెళ్లి గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆమె ఫలానా సెలబ్రిటీతో డేటింగ్‌లో ఉంది అంటూ గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవాలు అని కొంతకాలం క్రితం తేలింది. కానీ, నయనతార మాత్రం ప్రేమలో ఉన్న మాట మాత్రం వాస్తవం. ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఆమె చాలాకాలంగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. రెండు సంవత్సరాల క్రితమే ఈ జంట వివాహ బంధంతో ఒకటవుతారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. కానీ, వీళ్లు విహారయాత్రలకు వెళ్లడం.. అక్కడ ఫోటోలు దిగడం మాత్రం తరచూ జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వరకూ కూడా ఈ జంట విహారయాత్రకు వెళ్లి.. అక్కడి పిక్స్‌ని సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా ఈ జంట మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడితో కలిసి చెన్నైకి చెందిన పానీయాల బ్రాండ్ ‘చాయ్ వాలే’ లో ఆమె పెద్ద మొత్తంలో నయనతార పెట్టుబడి పెట్టిందట. దేశవ్యాప్తంగా 35 స్టోర్లు తెరవాలని ఈ బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుందట. ఇందుకోసం పలువురు సినీ ప్రముఖలను సహాయం కోరగా.. వాళ్లు ఇందులో పెట్టుబడులు పెట్టారు. తాజాగా నయనతార, విఘ్నేశ్ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. మరి వీళ్లకు బిజినెస్ రంగం ఏం రేంజ్‌లో కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.
from https://ift.tt/3jmvH5v
No comments:
Post a Comment