మరో ఆరు రోజుల్లో ‘బ్లాస్టర్’ వచ్చేస్తుంది.. మహేష్ అభిమానుల్లో జోష్ నింపుతున్న చిత్ర యూనిట్.. - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 3 August 2021

మరో ఆరు రోజుల్లో ‘బ్లాస్టర్’ వచ్చేస్తుంది.. మహేష్ అభిమానుల్లో జోష్ నింపుతున్న చిత్ర యూనిట్..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్‌ని వెండితెరపై అభిమానులు చూడలేదు. ఈ సినిమా తర్వాత ఆయన ‘గీతగోవిందం’ ఫేమ్ దర్శకుడు డైరెక్షన్‌లో ‘’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అయింది. అయితే ఈ సినిమా గురించి సరైన అప్‌డేట్స్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. మహేష్ ముఖాన్ని కూడా పూర్తిగా చూపించకుండా ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయడంతో.. వాళ్లు ఆగ్రహం చెందారు. కొద్ది రోజుల క్రితం ఫస్ట్‌ నోటీస్ అనే పేరుతో ఈ సినిమా నుంచి లేటెస్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ ఫస్ట్ నోటీస్ పోస్టర్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి దూసుకుపోతోంది.. ఈ సర్‌ప్రైజ్ చాలదు అంటూ.. మహేష్ అభిమాలనుకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయింది చిత్ర యూనిట్. మహేష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ‘బ్లాస్టర్’ వస్తుంది అంటూ ఫస్ట్‌లుక్ విడుదల చేసిన రోజే ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వచ్చిన రోజు నుంచి చిత్ర యూనిట్ జోష్ మామూలుగా లేదు. తాజాగా సినిమా నుంచి బ్లాస్టర్ వస్తుంది అంటూ ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా మరో పోస్ట్ పెట్టింది. మరో ఆరు రోజుల్లో బ్లాస్ట్ దద్దరిల్లిపోతుంది అంటూ ట్వీట్ చేసింది. సూపర్‌స్టార్ యాక్షన్‌ని చూసేందుకు రెడీగా ఉండండి అంటూ పేర్కొంది. దీన్ని బట్టి ఆగస్టు 9న ఈ సినిమా నుంచి టీజర్ విడుదల అవుతుంది అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2022 జనవరి 13న విడుదల చేయబోతున్నట్టు ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ప్రకటించారు.


from https://ift.tt/3lrGmhC

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages