విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన '' మూవీ ఇటీవలే విడుదలైన విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు ఇది రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. రీమేక్ సినిమా అయినప్పటికీ.. ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందింది. ఈ సినిమాలో వెంకటేష్ నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురుస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఎక్కడ చూసిన నారప్ప గురించే మాట్లాడుకుంటున్నారు. అలా తమిళలంలో వచ్చినప్పటి తెలుగులో వచ్చిన వర్షన్‌పై కూడా మంచి స్పందన వచ్చింది. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఇలాంటి సినిమా ఓటీటీలో విడుదల అవ్వడం ఎంటీ అని అభిమానులు కామెంట్లు కూడా పెట్టారు. తాజాగా తన సినిమాపై విక్టరీ వెంకటేష్ స్వయంగా ట్వీట్ పెట్టారు. ‘నారప్ప’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము అంటూ వెంకటేష్ లేటెస్ట్‌గా ట్వీట్ చేశారు. ఇలాంటి టీం ఉంది కాబట్టే ఇలాంటి సినిమా చేయగలిగాము అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలాంటి షాట్‌లలో షూటింగ్ చేయడం ప్రతి ఒక్కరికి ఓ సవాలు వంటిది అని.. కాని ఈ టీమ్ వల్ల అది సామాన్యంగా జరిగిపోయింది అని అన్నారు. నారప్ప సినిమా లోకేషన్లు సంబంధించిన వీడియోని ఆయన షేర్ చేశారు.
from https://ift.tt/3lrPO4Q
No comments:
Post a Comment