సినిమానే పిచ్చి.. ఇండస్ట్రీలో ఉండటానికి ఆ పని చేయడానికైనా సిద్దమే! రాజా రవీంద్ర కామెంట్స్ వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, 17 August 2021

demo-image

సినిమానే పిచ్చి.. ఇండస్ట్రీలో ఉండటానికి ఆ పని చేయడానికైనా సిద్దమే! రాజా రవీంద్ర కామెంట్స్ వైరల్

Responsive Ads Here
photo-85419639
సినిమానే ప్రాణం, సినిమానే జీవితం, సినీ లోకమే ప్రపంచం.. ఇలా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కలలుగనే వారు చాలామందే ఉంటారు. ఎలాగైనా సినీ ఇండస్ట్రీలో స్థిరపడాలనేదే వారి గోల్. ఇక ఇప్పటికే ఇండీస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటీనటుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు ఎంతోమందికి ఉంటాయి. తాజాగా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటుల్లో ఒకరైన ఇలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. తనకు సినిమా అంటే పిచ్చి అంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘’. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాపై తనకున్న ప్రేమను బటయపెట్టారు రాజా రవీంద్ర. 'క్రేజీ అంకుల్స్' సినిమా మంచి వినోదాన్ని పంచుతుందనే నమ్మకం ఉందని చెప్పిన రాజా రవీంద్ర.. కరోనా సమయంలో ఇండీస్ట్రీలోని చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అలాంటి సమయంలో కూడా తమ క్రేజీ అంకుల్స్ షూటింగ్ పూర్తి చేసామని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాకు క‌నెక్ట్ అవుతారని, ఇందులో తనతో పాటు పోసాని క్యారెక్టర్ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పారు. తనకు సినిమా అంటే పిచ్చి అని, ఒకవేళ సినిమా అవకాశాలు రాకపోతే.. ఆర్టిస్టులకు, టెక్నిషియన్లకు కాఫీ, టీ ఇచ్చుకుంటూ అయినా ఇదే ఇండస్ట్రీలో కొనసాగుతానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని ఏం పెట్టుకోనని, తన దగ్గరికి వచ్చే ప్రతీ అవకాశం అందిపుచ్చుకోడానికే ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. ఓటీటీ వ‌చ్చాక న‌టీన‌టులకు అవకాశాలు పెరిగాయి కానీ అన్ని సినిమాలు ఓటీటీల బాట పడితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆయన చెప్పడం విశేషం.


from https://ift.tt/3k2gsyH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages