ఆడిషన్‌కి రావాలన్నారు.. బెడ్‌పై ఆ రోజు!! పరిస్థితి వివరిస్తూ రహస్యం బయటపెట్టిన బుల్లితెర బ్యూటీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Tuesday, 17 August 2021

demo-image

ఆడిషన్‌కి రావాలన్నారు.. బెడ్‌పై ఆ రోజు!! పరిస్థితి వివరిస్తూ రహస్యం బయటపెట్టిన బుల్లితెర బ్యూటీ

Responsive Ads Here
photo-85418556
రాను రాను బులితెరపై హాట్ యాంకర్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అందమైన భామలతో తమ తమ షోలకు కొత్త శోభ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్‌ యాంకర్‌గా పాపులర్ అయిన .. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక షోలో అడుగుపెట్టి అట్రాక్ట్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలతో పాటు రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన లైఫ్‌లో జరిగిన సంఘటనను వివరిస్తూ.. ఎప్పుడు ఎలాంటి అవకాశం తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరంటూ సీక్రెట్ బయటపెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే.. ''కొన్నిరోజుల క్రితం నేను ఫేస్ చేసిన పరిస్థితి ఇది. అనుకోకుండా నా హెల్త్ చాలా బాలేకుండా అయ్యింది. కనీసం నేను బెడ్ మీద నుండి లేవలేని సిట్యుయేషన్. నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆ సిట్యుయేషన్‌లో మల్లెమాల ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. బెస్ట్ అఫ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్ కోసం ఆడిషన్ ఉంది రావాలి అన్నారు. వాళ్లకి యాంకర్‌ని తీసుకోవడం చాలా అర్జెంట్. నా ముందు రెండే ఎంపికలు. ఆ రోజు ”Take the risk or lose the chance” అనేది కళ్ళ ముందు కనబడుతోంది. ఇంట్లో వాళ్ళందరూ ఈ పరిస్థితిలో ఎందుకు లే వద్దు అన్నారు. అప్పటికే ఆ నెలలో వచ్చిన అన్ని ఆఫర్స్‌ని వదిలేసుకున్నాను. ఏదైతే అది అయ్యింది అని దేవుడి మీద భారం వేసి నా కష్టాన్ని నమ్మి ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడికి వెళ్ళాక చూస్తే నాతో పాటు ఓ ఆరుగురు అమ్మాయిలు కూడా వచ్చారు. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. ఫుల్ ఎనర్జిటిక్‌గా డాన్స్ వేశారు. ఇంక నేను అనవసరంగా వచ్చాను, నేను కనీసం స్ట్రాంగ్‌గా నిలబడలేని పరిస్థితి అని నా మనసులో అనుకొని వెళ్లి నిలుచున్నాను. ఓ సాంగ్ ప్లే చేశారు ఏదో రెండు స్టెప్స్ వేసా మెల్లగా. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా చెప్పేశాను. అసలా రెండు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు. మీకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అమ్మ అంటూ నాతో వచ్చిన లేడీ అసిస్టెంట్ ఫుల్లు ఏడవడం మొదలు పెట్టింది. ఏం కాదులే అమ్మాయి అంతా మంచే జరుగుతుంది లే అన్నాను. మొత్తానికి అయ్యాక ఇంటికి వచ్చేసాం. ఇంక నాకు రాదు లే అని ఫిక్స్ అయిపోయి ఆ రెండు రోజులూ ఆలోచిస్తూ ఉండిపోయాను. సడన్‌గా మళ్లీ మల్లెమాల నుండి మేనేజర్ కాల్ చేశారు. ఒకసారి ఆఫీస్‌కి రండి.. సార్ మీతో మాట్లాడతారట అని. ఫైనల్‌గా మీటింగ్‌కి వెళ్లి మాట్లాడాను. వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. మీకు ఈ షో చేయటం ఇష్టమేనా అని అడిగారు. ప్రోగ్రాం మీ దృష్టిలో చిన్నది అవ్వచ్చు, కానీ నాకు ఈ పరిస్థితిలో అదో పెద్ద అచీవ్మెంట్. మొత్తానికి నేను 'take a risk once in a life, never giveup' అనేది నమ్మాను'' అంటూ స్రవంతి ఆ రోజున తన పరిస్థితిని మొత్తం కళ్లముందుంచింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


from https://ift.tt/3y0Nc0i

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages