
యాంకర్ రష్మీ.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ భామ మనసు వెన్న. తనకు అందమైన రూపమే కాదు మంచి మనసుందని చాలాసార్లు నిరూపించుకుంది రష్మీ గౌతమ్. ముఖ్యంగా మూగజీవాల పట్ల ఆమె చూపే ప్రేమ, కేరింగ్ చాలామంది హృదయాలకు కనెక్ట్ అయింది. ఏ జంతువుకి హాని జరిగినా వెంటనే స్పందించే రష్మీ.. తాజాగా ఓ శునకానికి జరిగిన ప్రమాదం తాలూకు విషయాలు వెల్లడిస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఈ మేరకు తన అభ్యర్థనను నెటిజన్ల ముందుంచింది. మూగజీవాల కోసం ఎక్కువగా సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లే రష్మీ.. ఇషాన్ అనే కుక్క ఆరంతస్థుల భవనం నుంచి కిందపడిన విషయాన్ని, దాని ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ చికిత్స కోసం దానం చేయండని సామాజిక మాధ్యమాల వేదికగా కోరింది. ఇషాన్ అనే కుక్క ఆరంతస్థుల భవనం నుంచి కిందపడిందట. వెన్ను పూస డ్యామేజ్ కావడంతో దానికి నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇంకా సమస్య కొలిక్కి రాలేదట. చికిత్స కోసం రోజుకి 300-400 రూపాయల వరకు ఖర్చవుతోందట. అది తిరిగి నడిచేందుకు ఇంకాస్త సమయం పడుతుందట. అయితే ఆ శునకాన్ని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆపరేషన్ చేయాలని రష్మీ అంటోంది. ఆ కుక్కను రెస్క్యూ చేసిన మహిళకు అంత స్థోమత లేదని, తన వద్దకు వచ్చి సాయం కోరిందని చెప్పిన రష్మీ.. తన వంతు సాయం చేస్తున్నానని చెప్పింది. ''మీరంతా కూడా సాయం చేస్తారని ఆశిస్తున్నా.. ప్లీజ్ మీకు తోచినంత సాయం చేయండి. నన్ను 3.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క రూపాయి సాయం చేసినా చాలు'' అని రిక్వెస్ట్ చేసింది రష్మీ. ఇలా నేరుగా వీడియోలోకి వచ్చి ఇలా అభ్యర్థించడంతో ఆమె అభిమానులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ సాయం చేస్తున్నారు. అండగా మేం ఉంటమంటూ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూగ జీవాల పట్ల రష్మీ చూపిస్తున్న ప్రేమపై ప్రశంసలు దక్కుతున్నాయి.
from https://ift.tt/3yZXJtX
No comments:
Post a Comment