నా ఫొటోగ్రఫీని దొంగిలించాడు.. ఆది పినిశెట్టిపై మంచు మనోజ్ ఆరోపణలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 22 November 2020

నా ఫొటోగ్రఫీని దొంగిలించాడు.. ఆది పినిశెట్టిపై మంచు మనోజ్ ఆరోపణలు

సినిమా హీరోలు , ఆది పినిశెట్టి మంచి స్నేహితులు అనే విషయం చాలా మందికి తెలుసు. నిజానికి వీళ్లు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీకి, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ఉంది. అందుకే, వీరి బిడ్డలైన మనోజ్, ఆది మధ్య కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ ఎవరి జీవితం వారు గడుపుతోన్న మనోజ్, ఆది.. అప్పుడప్పుడు మోటార్‌ సైకిళ్లపై రోడ్ ట్రిప్ వెళ్తుంటారు. తాజాగా తమ స్నేహితులతో కలిసి ఆది రోడ్ ట్రిప్ వెళ్లారు. ఈ రోడ్ ట్రిప్‌లో భాగంగా తీసిన ఫొటోలను ఆది ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో ఆదితో తన స్నేహితులందరూ ఉన్నారు. అలాగే, సూర్యోదయం సమయంలో నదీ ప్రవాహం మీదుగా ఒక పక్షి ఎగురుతున్న ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో చాలా అందంగా ఉంది. ఈ ట్వీట్‌కు ‘సండే మార్నింగ్, రోడ్ ట్రిప్, సన్‌రైజ్, ఫ్రెండ్స్, ఫొటోగ్రఫీ, కాఫీ టాక్’ అని హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. ఆ తరవాత ఏంటంటే.. ఆది ట్వీట్‌కు మంచు మనోజ్ రిప్లై ఇచ్చారు. Also Read: ‘‘ఈ అబ్బాయి నాకు బెస్ట్ ఫ్రెండ్. కానీ, అతను నా బర్డ్ ఫొటోగ్రఫీని దొంగిలించి తన ఫొటోగ్రఫీలా పోస్ట్ చేశాడు. ఇప్పుడు అతన్ని నేను ఏం చేయాలి? దయచేసిన నాకు కొన్ని సలహాలు ఇవ్వండి. జీవితాంతం అతన్ని చిత్రహింసలకు గురి చేస్తాను’’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. దీనికి ఆది కూడా సరదాగా రిప్లై ఇచ్చారు. ‘‘నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడే ఈ ఫొటోను తీశాను బాబాయ్. నీ ఫొటోల కాపీ రైట్లు అన్నీ నావే’’ అని ఆది పేర్కొన్నారు. దీనికి మంచు మనోజ్.. ‘‘లవ్ యు బాబాయ్’’ అని స్పందించారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ఒక సరదా ట్వీట్ వార్ జరిగింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో బిజీగా ఉన్నారు. సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రంగా ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. ఆయనే హీరో. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ‘అహం బ్రహ్మాస్మి’ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు, ఆది కూడా ‘క్లాప్’, ‘గుడ్ లక్ సఖి’ సినిమాల్లో నటిస్తున్నారు.


from https://ift.tt/336SH0S

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages