మారేడుమిల్లిల్లో అర్హ పుట్టినరోజు వేడుకలు.. గుర్తుండిపోయే ఆతిథ్యం అన్న బన్నీ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 22 November 2020

మారేడుమిల్లిల్లో అర్హ పుట్టినరోజు వేడుకలు.. గుర్తుండిపోయే ఆతిథ్యం అన్న బన్నీ

స్టైలిష్ స్టార్ గారాలపట్టి అర్హకు తన నాలుగో పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే, ఇప్పటి వరకు ఆ చిన్నారి తన పుట్టినరోజులను హైదరాబాద్‌లోని ఇంట్లోనే జరుపుకోగా.. ఈసారి మాత్రం డెస్టినేషన్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అందులోనూ మారేడుమిల్లి లాంటి అటవీ ప్రాంతంలో. అల్లు అర్హ నాలుగో పుట్టినరోజు వేడుకలు నవంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరిగాయి. దీనికి కారణం మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ‘పుష్ప’ షూటింగ్ ప్రస్తుతం అక్కడే జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఇటీవలే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రారంభమైంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అక్కడే రిసార్ట్స్ అద్దెకు తీసుకుని అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్‌ను ఉంచింది. ఆ రిసార్ట్స్‌లోనే అల్లు అర్హ పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఈ పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లను మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ చాలా గ్రాండ్‌గా చేశారు. సంప్రదాయ గిరిజన నృత్యాలు, విద్యుద్దీపాల అలంకరణ అబ్బో ఏర్పాట్లు అదిరిపోయాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు ‘పుష్ప’ యూనిట్ పాల్గొంది. Also Read: తన కుమార్తె పుట్టినరోజును ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు గాను ‘పుష్ప’ నిర్మాతలకు బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలను కూడా పొందుపరిచారు. ‘‘అర్హ పుట్టినరోజు సందర్భంగా మాకు గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి గారు, నవీన్ గారు, చెర్రీ గారికి కృతజ్ఞతలు. ఆతిథ్యం అదిరిపోయింది’’ అని బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


from https://ift.tt/39bxV4d

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages