బాలకృష్ణ నన్ను కొట్టలేదు.. ఫోన్ అందుకే విసిరారు: ‘సెహరి’ హీరో హర్ష్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday, 19 November 2020

బాలకృష్ణ నన్ను కొట్టలేదు.. ఫోన్ అందుకే విసిరారు: ‘సెహరి’ హీరో హర్ష్

నటసింహా నందమూరి ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే చాలు అంతా ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆయన ప్రవర్తన, మ్యానరిజం ఎలా ఉందో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కచ్చితంగా వాళ్లకు కావాల్సిన స్టఫ్ దొరికేస్తుంది. దాన్ని పట్టుకుని ఇక ఆడుకుంటారు. బోలెడంత ఫన్. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్. ఇక కొంత మంది అయితే బాలయ్యను ఎగతాళి కూడా చేస్తారు. తాజాగా ఇలాంటి ఎగతాళి కార్యక్రమం ఒకటి సోషల్ మీడియాలో జరిగింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘సెహరి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరో హర్ష్ కనుమిల్లి ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. అయితే, ఈ కార్యక్రమం జరిగిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణ మ్యానరిజంపై సోషల్ మీడియాలో వెటకారం మొదలైపోయింది. హీరో హర్ష్‌పై బాలకృష్ణ చేయి చేసుకున్నారని, నిర్మాత అద్వయపై ఆగ్రహం వ్యక్తం చేశారని, తన ఫోన్‌ను బాలయ్య విసిరి కొట్టారని మీమ్స్ సోషల్ మీడియాలో హల్ ‌చల్ చేశాయి. సాధారణంగా బాలయ్య ఎప్పుడూ ఎవరినో ఒకరిని కొడుతూనే ఉంటారని పేరుంది కాబట్టి ఇది కూడా నిజమైపోయింది. Also Read: కానీ, హర్ష్‌పై బాలయ్య చేయి చేసుకోలేదు. ఈ విషయాన్ని హర్ష్ స్వయంగా వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి ఒక విర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్న హర్ష్.. బాలయ్యపై మొదలైన మీమ్స్ గురించి వివరణ ఇచ్చారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పుడు తాను పోస్టర్‌ను ఎడమ చేతితో పట్టుకున్నానని, అందుకుని ఆ చేయి మీద బాలయ్య చిన్నగా కొట్టి కుడి చేతితో పట్టుకోమని చెప్పారని, ఈ మాత్రం దానికి రకరకాల సౌండ్లతో మీమ్స్ వచ్చేశాయని హర్ష్ వివరించారు. అలాగే, బాలయ్య ఫోన్ విసిరిన ఘటనపై కూడా హర్ష్ స్పందించారు. ‘‘కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు బాలయ్య తన కళ్లద్దాలు తీసి అసిస్టెంట్‌ పైకి విసిరారు. ఆయన పట్టుకున్నాడు. కరెక్ట్‌గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసే సమయంలో ఫోన్ రావడంతో దాన్ని కూడా తన అసిస్టెంట్ పట్టుకుంటాడనే ఆయన విసిరినట్టున్నారు’’ అని వివరణ ఇచ్చారు. మొత్తం మీద తననైతే బాలయ్య కొట్టలేదని ఆ మీమ్స్‌కు హర్ష్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. Also Read: కాగా, ‘సెహరి’ సినిమాను వ‌ర్గో పిక్చర్స్ బ్యానర్‌పై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడే ఈ అద్వయ జిష్ణు రెడ్డి. వర్గో పిక్చర్స్ బ్యానర్‌లో వస్తోన్న తొలి సినిమా ఇది. హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రన్ చౌద‌రి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రముఖ సంగీత ద‌ర్శకుడు కోటి ఒక కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. జ్ఞానసాగ‌ర్ ద్వార‌క ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. హీరో హర్ష్ ఈ సినిమాకు కథను అందించారు.


from https://ift.tt/2UGNaJQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages