నాగార్జున కొడుకుపై మెగాస్టార్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 8 April 2020

నాగార్జున కొడుకుపై మెగాస్టార్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

తెలిసిన తెలియని వయసులో సిసింద్రీ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన బుడతడు . ‘అఖిల్’సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వీవీ వినాయక్ డైరెక్షన్లో నితిన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత హలో , మిస్టర్ మజ్ను సినిమాలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తన నాల్గో సినిమా చేస్తున్నాడు. అఖిల్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ తారలంతా అఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈరోజు బర్త్ డే చేసుకుంటున్న అల్లు అర్జున్ కూడా అఖిల్‌కు విషెస్ చెప్పాడు. మరోవైపు ఈ మధ్యే సోషల్ మీడియాలోకి వచ్చిన సైతం యంగ్ హీరోలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయం నుంచి బన్నీతో పాటు అకిరా, అఖిల్‌కు విషెస్ చెప్పారు. చిన్ననాటి ఫోటోల్ని షేర్ చేశారు. హ్యపీ బర్త్ డే అఖిల్.. చరణ్‌కి ఒక తమ్ముడు, సురేఖకు నాకు కొడుకు లాంటివాడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, రానున్నకాలమంతా నీకు మంచి జరగాలని అంటూ చిరు ట్వీట్ చేశారు. అఖిల్ చిన్నప్పుడు, నాగార్జునతో కలిసి దిగిన ఫోటోను ఈ సందర్భంగా చిరంజీవి షేర్ చేశారు. ఈ ట్వీట్‌పై అఖిల్ సైతం స్పందించాడు. మీ విషెస్‌కు బదులు ఇచ్చేందుక నా దగ్గర మాటల్లేవు. థాంక్యూ సో మచ్ మెగాస్టార్ అంటూ రిప్లై ఇచ్చాడు అఖిల్. మరోవైపు ఇక ఈరోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో అఖిల్ కు అభిమానులు , సినీ ప్రముఖులు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తాను అభిమానుల కోసం ఎలాంటి సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేయడం లేదని అఖిల్ తన అభిమానులకు తెలిపాడు. తన పుట్టిన రోజు అని సెలెబ్రేషన్స్ చేయవద్దని తన అభిమానులకు సూచించాడు. పుట్టినరోజున తన సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్స్ టీజర్ వంటివి కూడా రిలీజ్ చేయడం లేదని బాంబ్ పేల్చాడు. ఇలాంటి విపత్కర సమయంలో అలాంటివి ఏమీ వద్దని దర్శక నిర్మాతలతో వద్దన్నానని అఖిల్ తెలిపాడు. తాను రేపు ఫ్యామిలీతో ఓ పిక్ దిగి పోస్ట్ చేస్తానని, మీరంతా కూడా అలాగే చేయాలని అభిమానులకు సూచించాడు.


from https://ift.tt/2V4UCOw

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages