బన్నీ కాలికి ఆరో వేలు... ఆసక్తి రేకిస్తోన్న ‘పుష్ప’ సినిమా పోస్టర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday, 8 April 2020

బన్నీ కాలికి ఆరో వేలు... ఆసక్తి రేకిస్తోన్న ‘పుష్ప’ సినిమా పోస్టర్

స్టైలిష్ స్టార్ సందర్బంగా ఆయన ఫ్యాన్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. తన 20వ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. సినిమాకు పుష్ప అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిగా మొత్తం ఐదు భాషాల్లో ఈ సినిమా విడుదలకానుంది. తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ, తమిళ్ ,హిందీ లో విడుదలకానుంది. ఇక ఫస్ట్ లుక్ మాత్రం అదరగొట్టింది. మొదట విడుదల చేసిన పోస్టర్ లో కోపంగా చూస్తూ కనిపించిన రెండవ పోస్టర్ లో పోలీసులకు దొరికిపోయి కింద కూర్చొని కనిపించాడు. ఈ రెండు పోస్టర్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు ‘పుష్ప’ టైటిల్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. సినిమా పోస్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే... టైటిల్ పేరు ఫింగర్ ప్రింట్స్‌ను పోలి ఉంది. దీంతో ఈ సినిమా క్రైమ్ కథను పోలి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా పోస్టర్‌లో బన్నీ ఎడమకాలికి ఆరు వేళ్లు ఉన్నాయి. దీంతో ఫింగర్ ప్రింట్స్, ఆరో వేలి చుట్టూ ఏదో కధ ఉందని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా మనకు కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అని కొందరు అంటున్నారు. మరికొందరు హీరోయిన్ పేరు పుష్ప అని... బన్నీ నడిపే లారీ పేరు కూడా పుష్ప అని చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్‌‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. సేతుపతి ప్రేమించిన అమ్మాయి పేరు పుష్ప అని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద పుష్ప చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందని మాత్రం అంతా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో హీరో విలన్‌ను ఛేజ్ చేసే సీన్లు అత్యంత అద్భుతంగా ఉంటాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.


from https://ift.tt/3e69ZiH

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages