‘సామ్ జామ్’ ఎపిసోడ్ 2: చీఫ్ గెస్ట్ చిరంజీవి కాదు.. రానా! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 22 November 2020

‘సామ్ జామ్’ ఎపిసోడ్ 2: చీఫ్ గెస్ట్ చిరంజీవి కాదు.. రానా!

స్టార్ హీరోయిన్ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘సామ్ జామ్’. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ఈ టాక్ షో ప్రసారమవుతోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయితే, ‘సామ్ జామ్’ రెండో ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు. దీనికి కారణం ‘సామ్ జామ్’ షోలో పాల్గొన్న చిరంజీవి ఫొటోలు ఇటీవల బయటకు రావడమే. అయితే, చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ తరవాత ప్రసారం కానుంది. రెండో ఎపిసోడ్‌లో హీరో రానా దగ్గుబాటి, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొంటున్నారు. ఈ మేరకు ‘ఆహా’ ప్రకటించింది. త్వరలోనే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి టీజర్‌ను విడుదల చేయనున్నారు. కాగా, ‘సామ్ జామ్’ తొలి ఎపిసోడ్‌పై విమర్శలు వచ్చాయి. షో పెద్దగా బాలేదని, సమంత హోస్టింగ్ కూడా అంత గొప్పగా లేదని చాలా మంది విమర్శించారు. అందుకే, రెండో ఎపిసోడ్‌లో చిరంజీవిని అల్లు అరవింద్ రంగంలోకి దించారని వదంతులు వచ్చాయి. చిరంజీవి రాకతో ‘సామ్ జామ్’ షోకు రేటింగ్ కూడా పెరుగుతుందని మెగా అభిమానులతో పాటు చాలా మంది భావించారు. కానీ, ఇప్పుడు చిరంజీవి రాకు ఆలస్యం చేస్తున్నారు. మరి, రానా పాల్గొంటున్న రెండో ఎపిసోడ్ అయినా ‘సామ్ జామ్’ భవితవ్యాన్ని మారుతస్తుందో లేదో చూడాలి. Also Read:


from https://ift.tt/3foRhE4

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages