నేనూ సాయం చేశా కాని.. ఫొటోలు తీసుకోకుండా తప్పు చేశా.. సోనూసూద్‌పై బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 17 August 2020

నేనూ సాయం చేశా కాని.. ఫొటోలు తీసుకోకుండా తప్పు చేశా.. సోనూసూద్‌పై బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్

సినిమాల్లో విలన్ వేషాలు వేసినా.. రిల్ లైఫ్‌లో నిజమైన హీరో అంటే అనేంతగా ఈ కరోనా కాలంలో రియల్ హీరోగా కీర్తింపడుతున్న సోనూసూద్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు హాస్యబ్రహ్మ . సోనూసూద్ చేస్తున్న సాయంపై ప్రశంసలు కురిపిస్తూనే డబ్బు విలువను గురించి సూక్తులు చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. ఆయన మాట్లాడుతూ.. ‘సోనూసూద్.. ఆయన కూడా వలస వచ్చినవాడే కాబట్టి.. తన శక్తిమేర వలస కార్మికుల్ని ఎంతో ఆదుకున్నారు. సూర్యుడిలా ఆరిపోయి జీవితాల్లో వెలుగులు నింపాడు. అలాగే నేను.. నాకున్న జీవితానికి ఇలాంటి పనులు ఎన్నో ఈ మధ్య కాలంలో చేశాను. అయితే నువ్ చేశావు అనడానికి ప్రూఫ్‌లు ఏవి అంటే మాత్రం చెప్పలేను. ఎందుకంటే నేను ఫొటోలు తీయించుకోలేదు.. అదొక్కటే నేను చేసిన తప్పు.. ఒప్పు కూడా. సోనూసూద్ ఒక సూర్యుడు లాంటి వాడైతే.. నేను మిణుగురు పురుగు లాంటి వాడిని. నాకున్న కాంతి నాకు ఉంటుంది. నాకున్న కాంతిని చిన్న పిట్ట ముక్కుతో తీసుకుని తన గూటిలో పెట్టుకుని పిల్లలకు వెలుగు నింపుకుంది నా జీవితానికి అది చాలు. నేను డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటానని కామెంట్స్ చేస్తుంటారు. అవును నేను డబ్బు దగ్గర జాగ్రత్తగానే ఉంటా.. లేకపోతే ఎవరో వచ్చి సాయం చేస్తారని. వాళ్లపై ఆధాపడి ఎదురుచూడాల్సి వస్తుంది. అది దుఖానికి హేతువు. నా దగ్గరకు వచ్చిన మిత్రులకు నేను అదే చెప్తుంటా.. నీకు తినడానికి తిండి ఉంటే చిన్న గూడు ఏర్పాటు చేసుకోండి. తిరగడానికి ఒక కారు కొనుక్కోండి చాలు. ఆ తరువాత తిన్నా.. తినకపోయినా మీ సామాన్లు పడేసే పరిస్థితి ఉండదు. ఈ మధ్య ఒక సీనియర్ కెమెరామెన్ భార్య పిల్లలతో నా దగ్గరకు వచ్చి.. సార్ మీకు గుర్తుందా?? కెమెరామెన్ అసోషియేషన్ వాళ్లు మీకు బెస్ట్ కమెడియన్ అవార్డ్ ఇచ్చినప్పుడు నేనే మిమ్మల్ని పిలిచాను. కాని ఇప్పుడు నా పరిస్థితి బాలేదు. అద్దె కట్టలేదని ఇంటి ఓనర్ సామాన్లు బయటపడేశాడు.. ఏం చేయలో తెలియక మీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు. ఆ టైంలో నేను చేసింది చాలా చిన్న సాయమే అయినా దాన్ని దానం అనలేం. ఈలోకంలో ఎవడూ ఎవడికి దానం చేయడు. నా సినిమాల విషయానికి వస్తే.. మీరు ఎంతో బిజీగా ఉండేవారు సినిమాలు తగ్గిపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఈ మాటలు వింటే నాకు నవ్వు వస్తోంది. ఏదైనా ఒక టైం వరకే నడుస్తోంది. ఒక దశను అనుభవించిన తరువాత ఎవరైనా పక్కకు వెళ్లాల్సిందే. నాకు ఆకలితో ఉన్నప్పుడు భోజనం చేశాను.. చాల్లేరా బాబూ అనుకున్నప్పుడు భోజనం చేశాను.. ఇప్పుడు నేను నాకు సరైన ఆహారం దొరికినప్పుడు మాత్రమే భోజనం చేయాలని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు బ్రహ్మానందం.


from https://ift.tt/3fZz5PL

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages