హీరోగా ఎంట్రీ ఇస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 17 August 2020

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది!

బాలకృష్ణ తరవాత నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. కానీ, వారిలో కేవలం యంగ్ టైగర్ మాత్రమే స్టార్ హీరో హోదా సంపాదించగలిగారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఓ వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా ప్రత్యేకత చాటుతున్నారు. అయితే, ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో రాబోతున్నారనేది ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, నార్నె శ్రీనివాసరావు కుమారుడు తెలుగు సినిమా పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారని అంటున్నారు. టాలీవుడ్‌లో ఆయన రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైందని వినికిడి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్స్ ప్రారంభమయ్యాయని సినీ పరిశ్రమలోని చాలా మంది అంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిని ఎవరు పరిచయం చేస్తారు, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాల కోసం వేచి చూడాల్సిందే. అయితే, తన బావమరిది సినీ రంగ ప్రవేశంలో ఎన్టీఆర్ ప్రమేయం ఉందా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్టీఆర్, నార్నె శ్రీనివాసరావు మధ్య విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. Also Read: ఇదిలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RRR మూవీతో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తోన్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లు. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు ఎన్టీఆర్. ఆ తరవాత ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.


from https://ift.tt/3avxCja

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages