నటి ఖుష్బూ కంటికి గాయం, ఆపరేషన్.. షాక్‌లో ఫ్యాన్స్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 19 August 2020

నటి ఖుష్బూ కంటికి గాయం, ఆపరేషన్.. షాక్‌లో ఫ్యాన్స్

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు సుందర్ కంటికి గాయమైంది. ఆమె కంటికి బుధవారం ఉదయం శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని ఖుష్బూ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నా కంటికి శస్త్రచికిత్స జరిగింది. నేను కొద్దికాలం అందుబాటులో ఉండను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని హామీ ఇస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి’’ అని ఖుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కంటికి బ్యాండ్‌ ఎయిడ్ కట్టిన ఫొటోను కూడా ట్వీట్‌లో పొందుపరిచారు. ఖుష్బూ చేసి ట్వీట్ తన అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఖుష్బూ త్వరగా కోలుకోవాలని ఆమె శ్రేయోభిలాషులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి ఖుష్బూ శస్త్రచికిత్స చేయించుకోవడానికి కొన్ని గంటల ముందు ఫిట్‌నెస్ గురించి ఒక ట్వీట్ చేశారు. మన పాత దుస్తులు మళ్లీ మనకు సరిపోతే ఆ ఆనందమే వేరు అంటూ ఈ ట్వీట్ చేశారు ఖుష్బూ. అంతేకాదు, ఆమె సన్నబడిన ఫొటోలను కూడా ట్వీట్‌లో పొందుపరిచారు. నిన్న మొన్నటి వరకు బాగా లావుగా కనిపించిన ఖుష్బూ.. ఇప్పుడు సన్నగా అయిపోయారు. దీనికి కారణం ఆమె చేసిన వర్కౌట్స్. ఇక ఖుష్బూ సినిమాల విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఆమె కనిపించనున్నారు. ఇటీవల, ‘లక్ష్మీ స్టోరీస్’ షోలో మహాలక్ష్మి దేవరాజ్ అనే పాత్రలో ఖుష్బూ కనిపించారు. సినిమాలతో పాటు తమిళంలో టీవీ సీరియల్స్‌లో కూడా చేస్తోన్న ఖుష్బూ.. ‘కుంకుమం’, ‘పార్థ గ్నాబగం ఇళ్లాయో’, ‘కల్కి’, ‘రుద్ర’, ‘నందిని’ వంటి సీరియల్స్‌లో నటిస్తు్న్నారు. ఇక వ్యాఖ్యాతగానూ ఖుష్బూ తనదైన ముద్ర వేశారు. ‘కోటీశ్వరి’, ‘జాక్‌పాట్’, ‘నమ్మ వీటు మహాలక్ష్మి’, ‘పూవ తాలియా’, ‘గెట్ రెడీ’, ‘నిజంగల్’ వంటి పాపులర్ షోలను ఖుష్బూ హోస్ట్ చేశారు. మరోవైపు జడ్జిగా ‘మానద మయిలాద’ (సీజన్ 3 నుంచి 5 వరకు, 7 నుంచి 8 వరకు), ‘జోడి నంబర్ వన్: సీజన్ 5’, ‘అళగియా తమిళ్ మగన్’ వంటి షోలలో కనిపించారు. Also Read:


from https://ift.tt/34fJzIQ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages