అంధుడ్ని సింగర్‌ చేసిన రఘు కుంచె.. ‘పలాస’ పాటతో ఫేమస్.. కళ్లు చెమ్మగిల్లే కథనం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Wednesday 19 August 2020

అంధుడ్ని సింగర్‌ చేసిన రఘు కుంచె.. ‘పలాస’ పాటతో ఫేమస్.. కళ్లు చెమ్మగిల్లే కథనం

మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం మ్యూజిక్ డైరెక్టర్‌గా సత్తా చాటిన రఘ కుంచే.. సింగర్ గానూ సూపర్ హిట్స్ సాంగ్ పాడారు. రొటీన్ పాటలకు భిన్నంగా స్వరాలతో ప్రయోగాలు చేసే రఘు కుంచే మాస్ పాటలకు పెట్టింది. ఇటీవల ఆయన సంగీత దర్శకత్వం వహించి పాడిన పలాస చిత్రంలోని నక్కిలీసు గొసులు పాట పెద్ద సంచలనం అయ్యింది. ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తుండగా.. పలాస చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను రాజు అనే అంధుడితో పాడించి మనసున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. గతంలో బేబీ అనే సింగర్‌ని ప్రపంచానికి తెలియడంతో కీలకపాత్ర పోషించిన రషుకుంచే.. ఆ తరువాత రైలులో పాటలు పాడే అసిరయ్య అనే సింగర్‌తోనూ పాటలు పాడించారు. అయితే పుట్టుకతోనే అంధుడైన రాజు.. పాటే ప్రాణంగా సినిమాల్లో పాట పాడాలని ప్రయత్నిస్తుండగా.. ‘పలాస’ చిత్రంలో పాట పాడించి అతని కోరికను నెరవేర్చడమే కాదు.. ఆర్థికంగా ఆదుకున్నారు . తన కలను సాకారం చేసిన రఘు కుంచెకి ఎప్పటికీ రుణ పడి ఉంటానంటూ తనకి సినిమాల్లో అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. సింగర్ రాజుది శంషాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. రాజు చిన్నప్పటి నుంచి పాటను ప్రేమించే వాడు.. పుట్టుకతోనే అందుడైన రాజు.. చిన్నప్పటి నుంచి పాటపై ఉన్న మక్కువతో.. కిరసనాయిల్ డబ్బాపై రూపాయి కాయిన్‌తో వాయిస్తూ పాటలు పడేవాడు. ఒక్కసారి విన్నాడంటే ఎంత కష్టమైన పాటైనా గుర్తుపెట్టేసుకుంటాడు రాజు. సినిమాల్లో పాడాలనే కోరికను తనలో బలంగా నాటుకుపోవడంతో.. చిన్నప్పటి నుంచి అదే ప్రయత్నంలో ఉన్నారు రాజు. తన పాటలో ఎవరి ప్రోత్సాహం లేదని.. కనీసం ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్పేవాళ్లు కాని సాయం చేసింది కూడా లేదని అంటున్నారు రాజు. అయితే తన జీవితం మలుపు తిరగడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ రఘు కుంచే అంటూ తనకు సినిమాల్లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు రాజు. ‘కిరసనాయిల్ డబ్బా, రూపాయి బిల్లతో పాటలు పాడుతూ ఉన్న నన్ను సోషల్ మీడియాలోకి తీసుకువచ్చింది డాన్స్ మాస్టర్ జాకీ. ఆయన నా పాట విని అసిస్టెంట్ సాయిని మా ఇంటికి పంపించి ఖలేజా సినిమాలో పాట పాడించి తీసుకుని వెళ్లారు. మణికొండలో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో నాతో పాట పాడించారు. ఆ పాటను ఆయన ఫేస్ బుక్‌లో పెట్టడంతో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే గారు చూశారు. ఆయన నా పాట విని ఇతను ఎవరో చాలా బాగా పాడుతున్నాడు.. ఎలాగైనా పాట పాడించాలని జాకీ మాస్టర్ ద్వారా నా ఫోన్ నంబర్ తీసుకున్నారు. అంతే కాదు జాకీ మాస్టర్ నా దగ్గరకు వచ్చి.. రఘు కుంచె గారు నీతో మాట్లాడతారట.. నీ నెంబర్ పంపుతున్నా అని చెప్పారు. ఆ మరుసటి రోజు రఘు కుంచే ఫోన్ చేసి నువ్ చాలా బాగా పడుతున్నావ్.. సోషల్ మీడియాలో చూశా.. అని చెప్పారు. ఆ తరువాత ఫిబ్రవరి 1న నేను ఫోన్ చేశా.. వెంటనే ఆయన స్టుడియోకి వచ్చి కలవమన్నారు. తరువాత ఏమనుకున్నారో తెలియదు కాని ఫోన్‌లోనే పాట పడమన్నారు. నేను గిజిగాడు పాట పాడి వినిపించాను. ఆయన నా పాట విని.. మాకు కొత్త సింగర్స్ కావాలి డైరెక్టర్‌తో మాట్లాడి తరువాత చెప్తా అన్నారు. నాకు జూన్ 10 ఫోన్ చేశారు రఘు కుంచె. నేను నీకు ఒక పాట పంపిస్తున్నా.. నేను ఏ యాసలో పాడితే నువ్ కూడా అదే యాసలో పాడి వినిపించమని చెప్పారు. ఎప్పట్లోగా పూర్తి చేస్తావ్ పాటని అంటే.. మూడు నాలుగు రోజులు టైం అడిగా. సరిగా పాడకపోతే తన్తా అని సరదాగా అన్నారు. నా కావాల్సిన టైం ఇచ్చి స్టుడియోకి పిలిచి పాట పాడించారు. ఉదయం 9 గంటలకు వెళ్లి వెయిట్ చేస్తే.. 11 గంటలకు షూటింగ్ స్టార్ట చేశారు. రఘు కుంచె దగ్గరకు వెళ్లిన తరువాత భయం కాదు కదా.. ధైర్యం వచ్చేసింది. 4 గంటలకు షూట్ అయిపోయింది. పలాస సినిమాలో ఫస్ట్ పాట నాతోనే పాడించారు. ఆ సాంగ్ సూపర్ వచ్చింది. థియేటర్లో నేను పాడిన పాట విని చాలా ఆనందం వేసింది. ఆ మరుసటి రోజు మా గురుమూర్తి రఘు కుంచే గారికి కాల్ చేశా. ఆ సినిమాలో ఆయన విలన్ వేషం వేయడంతో మీరంటే భయం లేదు కాని.. మీలోని నటుడంటే భయం వేసిందని చెప్పా. ఆ తరువాత ఆయన నాతో పాటు మా బావ, అమ్మని పిలిపించి మంచి భోజనం పెట్టారు. ఇంకోసారి మరో దర్శకుడితో కలిసి నన్ను పిలిపించుకుని ఆయన పలాస చిత్రంలో పాడిని నాది నక్కిలీసు గొలుసు పాట పాడించుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఎస్పీ బాలు అంటే ఇష్టం.. ఆయన్ని కలవాలని పదే పదే అనుకునేవాడిని. వీడు వీడి పాట.. ఎస్పీ బాలుని కలుస్తాడట అని నన్ను పిచ్చోడ్ని చూసినట్టు చేసేవారు. చాలా మంది నా ముందే పిచ్చోడ్నని అన్నారు. నాకు ఎస్పీ బాలు అంటే పిచ్చి.. కలవాలనుకోవడం తప్పా అని నాలో నేనే అనుకునేవాడిని. ఆ తరువాత నేను రామాచారి క్లాస్‌కి వెళ్లినప్పుడు ఎస్పీ బాలు గారిని పరిచయం చేశారు. ఎస్పీబాలు గారు నాతో మాట్లాడారు. బాగా పాడు నాయనా అని చెప్పారు. నా చిన్ననాటి కోరిక రామాచారి గారి ద్వారా తీరింది. సింగింగ్ అంటేనే వేస్ట్.. నా పాట ఎప్పుడు జనానికి వినిపించేది అని చాలా చాలా బాధ పడ్డాను. కాని రఘు కుంచే గారు నాకు సినిమా అవకాశం ఇచ్చి నన్ను సింగర్‌ని చేశారు. నా జన్మకి ఇది చాలు.. మీ రుణం తీర్చుకోలేను’ అంటూ ఎమోషన్ అయ్యారు సింగర్ రాజు. పలాస చిత్రంలో రాజు పాడిన టైటిల్ సాంగ్..


from https://ift.tt/2YhRRMe

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages