రిపోర్ట్ బాగుంది బ్రదర్.. ఏం పర్వాలేదు: చిరంజీవి సినిమాకు ఎన్టీఆర్ ధైర్యం చెప్పిన వేళ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 9 May 2020

రిపోర్ట్ బాగుంది బ్రదర్.. ఏం పర్వాలేదు: చిరంజీవి సినిమాకు ఎన్టీఆర్ ధైర్యం చెప్పిన వేళ

ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. డబ్బులు పెట్టే నిర్మాత దగ్గర నుంచి ఆ సినిమాకు పనిచేసే లైట్ బోయ్ వరకు.. ప్రతి ఒక్కరు చెమట దారబోసి వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరిస్తారు. నిర్మాత ఆ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంటారు. అలాంటి సినిమా విడుదల సమయంలో అడ్డంకులు ఎదురైతే, ఎన్నో ఆశలతో తెరకెక్కించిన సినిమాకు ప్రకృతి రూపంలో శత్రువు ఎదురైతే ఆ నిర్మాత బాధను మాటల్లో చెప్పలేం. నిజానికి నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవిలకు ఇలాంటి అనుభవం ఎదురైందట. కానీ, సినిమాలో ఉన్న మ్యాజిక్ కష్టకాలంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఆ సినిమా ఏమిటో ఇప్పటికే అర్థమై ఉంటుంది.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా విడుదలై నేటి(మే 9)కి 30 ఏళ్లు పూర్తయింది. ఐదు రోజుల క్రితం నుంచే 30 ఏళ్ల జగదేక వీరుడు అతిలోక సుందరి మానియా మొదలైపోయింది. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. ఈ సినిమా వెనకున్న స్టోరీలను రివీల్ చేస్తూ వస్తోంది. దీని కోసం నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్‌ను వాడుకుంది. అయితే, నాని వాయిస్ ఓవర్‌తో చివరిగా వచ్చిన వీడియో మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియోలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా విడుదల సమయంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు నాని. Also Read: 1990 మే 9న విడుదల తేదీని ఫిక్స్ చేశారు. అప్పట్లో అతిపెద్ద బడ్జెట్ సినిమా ఇది. పాటలు ముందుగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అన్నీ బాగున్నాయి.. ఇక థియేటర్లలో సినిమా కుమ్మేడం ఒక్కటే మిగిలింది అనుకుంటున్న సమయంలో మే 6న తుఫాన్ వార్తలు మొదలయ్యాయి. సినిమా ప్రింట్లు కూడా ఎలా పంపాలో తెలియని పరిస్థితి. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. ప్రింట్లు ఎలా పంపాలో అర్థం కాలేదు. ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ ఆపకూడదని.. మొత్తానికి అనుకున్న తేదీకి విడుదల చేశారు. అక్కడక్కడ మార్నింగ్ షోలు పడ్డాయి. కానీ, తుఫాన్ దాటికి సినిమా నిలబడుతుందా అనే భయం అశ్వనీదత్, రాఘవేంద్రరావుకు పట్టుకుంది. Also Read: అయితే, కూర్చొని బాధపడితే లాభం లేదని.. విజయవాడ వెళ్లి జరగాల్సింది ప్లాన్ చేద్దామని అశ్వనీదత్, రాఘవేంద్రరావు బయలుదేరారు. 11వ తేదీన వీరిద్దరూ విజయవాడలో దిగారు. మర్నాడు వీరిద్దరూ కలిసి గుంటూరు మంగ థియేటర్‌కు వెళ్లారు. అక్కడ వాతావరణం మరోలా ఉంది. జనం ఈలలు, గోలలు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడొచ్చిన చిన్న ధైర్యంతో గుంటూరు నుంచి తెనాలి బయలుదేరారు. Also Read: ఎన్టీ రామారావు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నేత హోదాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎదురయ్యారు. అశ్వనీదత్, రాఘవేంద్రరావు కారు ఆపి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. ఎన్టీఆర్ అప్పుడు గంభీరంగా.. ‘‘సినిమా రిపోర్ట్ బాగుంది. సెటిల్ అయిపోతుంది బ్రదర్. కంగారు పడకండి. నేను చెప్తున్నాను’’ అని ధైర్యం చెప్పారు. అంతే, ఆ తరవాత జగదేక వీరుడి గతి మారిపోయింది. రికార్డు స్థాయిలో దూసుకుపోయింది. ఇవే విషయాలను నాని వీడియోలో వెల్లడించారు.


from https://ift.tt/3bbWZ8s

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages