బర్నింగ్ స్టార్ .. తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరో. ఆయన చేసినవి పారడీ సినిమాలే అయినా ప్రేక్షకులపై ఆయన ఇంపాక్ట్ మాత్రం స్టార్ హీరో రేంజ్‌లో ఉంది. కేవలం నటుడిగానే కాకుండా తన స్తోమత మేర పేద ప్రజల సహాయార్థం విరాళాలు ఇస్తూ మనసున్న మంచి మనిషిగా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు సంపూ. పెద్ద హృదయం ఉన్న చిన్న హీరోగా తనకంటూ టాలీవుడ్‌లో ఒక ఇమేజ్‌ను ఏర్పరుచుకోగలిగారు. కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమకు చెందిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ చారిటీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు సంపూర్ణేష్ బాబు. ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా స్టార్ హీరోలు, దర్శకులు ఇళ్లలో పనులు చేస్తూ వీడియోలు పెడితే.. సంపూర్ణేష్ బాబు మాత్రం తన కులవృత్తి కంసాలి పని చేస్తూ సింప్లిసిటీని చాటుకున్నారు. తన చేతులతో భార్య, కూతురికి మెట్టెలు, గజ్జెలు చేశారు. ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ అంటే ఇదీ అని ప్రేక్షకులతో అనిపించుకున్నారు. Also Read: కిందటేడాది ‘కొబ్బరిమట్ట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూ.. ఈ ఏడాది మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా నేడు (మే 9న) ఆ చిత్ర విశేషాలను, ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. విదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో, ఒళ్ళు గగుర్పొడిచే గ్రాఫిక్స్‌తో రూపొందించిన సినిమా అని సంపూ వెల్లడించారు. ఆయన మాటల్లో, సినిమాల్లో వెటకారం గురించి అందరికీ తెలిసిందే. ఇంతకీ ఈ సినిమా టైటిల్ ‘?’. కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన ఉహాన్ గబ్బిలాల మార్కెట్‌లో చిత్రీకరించిన చివరి సినిమా ఇదట. మెడికల్ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను జూలై 30న విడుదల చేయనున్నట్టు కూడా సంపూ ప్రకటించారు. ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’ సినిమాలను అందించిన అమృత ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు నోలన్ మౌళి రచన, దర్శకత్వం అందించారు. ఇది సంపూర్ణేష్ బాబు 10వ సినిమా కావడం విశేషం.
from https://ift.tt/35Jfosd
No comments:
Post a Comment