RRRపై 'చిరు' ప్రభావం.. విడుదల తేదీపై అనుమానాలు! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 12 April 2020

RRRపై 'చిరు' ప్రభావం.. విడుదల తేదీపై అనుమానాలు!

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRRపై చిరంజీవి ఎఫెక్ట్ పడిందని, ఆ కారణంగా సినిమా విడుదల మరోసారి వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' సినిమానే ఇందుకు కారణం అని చెప్పుకుంటున్నారు. అదెలాగంటే.. ఆచార్య మూవీలో రామ్ చరణ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్, 'ఆచార్య' సెట్స్ మీదకు వెళ్లనున్నారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌కి కొద్దిరోజుల పాటు బ్రేక్ ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలు షికారు చేస్తుండటంతో RRR మరోసారి వాయిదా పడటం ఖాయం అనే మరో వార్త పుట్టుకొచ్చింది. 'ఆచార్య' కోసం రామ్ చరణ్ డేట్స్ ఇచ్చారు కాబట్టి RRR మిగిలిన భాగం షూటింగ్ ఆలస్యం కావడం, తద్వారా ఆ ఎఫెక్ట్ విడుదల తేదీపై పడే ఆస్కారముందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలను ఓ సారి వాయిదా వేశారు రాజమౌళి. మూవీ ప్రారంభంలో 30 జులై 2020నే విడుదల చేస్తానని ప్రకటించిన ఆయన.. కొన్ని అనివార్య కారణాల వల్ల 2021 జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ డేట్ కూడా కష్టమే అనే వార్తలు రావడం మెగా, నందమూరి అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందుతున్న RRR చిత్రానికి ఇటీవలే 'రౌద్రం రణం రుధిరం' అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు జక్కన్న. ఈ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా, కొమురం భీం రోల్ ఎన్టీఆర్ పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.


from https://ift.tt/3cc9SAd

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages