పవన్ కళ్యాణ్‌తో మరోసారి.... మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్.... - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 12 April 2020

పవన్ కళ్యాణ్‌తో మరోసారి.... మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్....

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మంచి టైమ్ నడుస్తోంది. అందుకే అద్బుతమైన అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్... ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర సినిమా కూడా కాజల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత కాజల్ ఎన్నో అవకాశాలు చేజెక్కించుకుంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే స్టార్ హీరోలందరి చేత జతకట్టింది. స్టాలిన్ సినిమాలో మెగాస్టార్‌తో, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్‌తో కలిసి నటించింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో మగధీరలో కలిసి నటించింది. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా చందమామలో కూడా కాజల్ మెప్పించింది. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీతో నే కాజల్ నటించనుంది. ఇప్పుడామె ఒకేసారి అన్నదమ్ముడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో రొమాన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో కథానాయకుడిగా 'ఆచార్య' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్ గా త్రిషని ముందుగా తీసుకున్నారు. ఆమె మధ్యలోనే సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఆమె స్థానంలో కాజల్ ని తీసుకొన్నారు. అంతేకాదు.. కాజల్ కి భారీ పారితోషికం కూడా ఇస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు కాజల్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించనున్న సినిమా కోసం కూడా కాజల్ నే తీసుకోవాలని అనుకుంటున్నారట. గతంలో సర్థార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్-కాజల్ జంటగా నటించారు. ఇప్పుడు హరీష్ సినిమా కోసం మరోసారి జతకట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


from https://ift.tt/39VJJEk

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages