కరోనా వేళ... కులాలపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 12 April 2020

కరోనా వేళ... కులాలపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు విలక్షణమైన నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం ఏదో ఓ వార్తతో టాలీవుడ్ టాక్‌గా మారుతుంటారు. అటు రాజకీయాల్లో కూడా మోహన్ బాబు పేరు అప్పుడప్పుడు హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ నడుస్తున్నడంతో ఇంటికే పరిమితమైన మొహన్ బాబు... ఓ టీవీ ఛానెల్‌కు ప్రత్యేకంగా ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడిన మోహన్ బాబు...కులాలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రెండు కులాలే ఉన్నాయన్నారు ‘ఇప్పుడున్న కులాలు రెండే రెండు.. పాజిటివ్ మరియు నెగిటివ్.. పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా ఇది అర్థం చేసుకుంటే చాలు. జీవితాంతం గొప్పగా ఉంటాడు. అది ఎవరైనా సరే. అది తెలుసుకోవడానికే వచ్చింది కరోనా’ అంటూ మోహన్ బాబు తెలిపారు. ఈ టైమ్‌లో కూడా ఆ విషయం తెలుసుకోలేకపోతే ఇక అంతే. బాంబ్ వేస్తే ఒక రోజులో చచ్చిపోతాం. కానీ మనందరం ప్రతి క్షణం చచ్చి బతుకుతున్నాం. ఏ క్షణంలో ఎవరికి వస్తుందో ఏమిటో తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా వస్తుందో తెలియదు. తల్లి బిడ్డల మధ్య దూరం పెంచింది. భార్యాభర్తలను సైతం గ్యాప్ తీసుకునేలా చేసింది. ఇంతకంటే శిక్ష ఏముంటుంది.. కాబట్టి అందరూ ఇకనైనా తెలుసుకుని మారాల్సిన టైమ్ వచ్చిందన్నారు మోహన్ బాబు. సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


from https://ift.tt/34wCDEZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages