రమ్యకృష్ణ బోల్డ్ అవతార్.. ఇదే అదునుగా భారీగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 14 April 2020

రమ్యకృష్ణ బోల్డ్ అవతార్.. ఇదే అదునుగా భారీగా డిమాండ్ చేస్తున్న హీరోయిన్

సీనియర్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రమ్యకృష్ణకు బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. హీరోగా రాబోతున్న ‘అంధాధున్’ తెలుగు రీమేక్‌లో ఆమె బోల్డ్ క్యారెక్టర్ చేయబోతోందట. అందుకు గాను భారీ పారితోషికం కావాలని డిమాండ్ చేస్తున్నట్లు టాక్. అడిగినంత ఇచ్చేందుకు ఆ చిత్రదర్శకనిర్మాతలు కూడా రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తోంది రమ్యకృష్ణ. ఈ సినిమా చేస్తుండగానే ‘ అంధాదున్’ తెలుగు రీమేక్‌లో ఆమెకు ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. హిందీలో వచ్చిన అంధాదున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, ఆయనకు సరితూగే పాత్రలో టబు నటించింది. బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ పోషించిన టబు ఈ మూవీ విజయంలో కీలక భూమిక పోషించింది. దీంతో అంధాదున్ తెలుగు రీమేక్ లోనూ టబునే ఫైనల్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేయడంలో వెనక్కితగ్గి అనసూయ వైపు మొగ్గు చూపారు మేకర్స్. ఇక ఇప్పుడు అనసూయను కూడా కాదనుకొని ఆ క్యారెక్టర్ రమ్యకృష్ణ చేత చేయించాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు రమ్యకృష్ణను సంప్రదించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే రమ్యకృష్ణ కూడా ఈ బోల్డ్ క్యారెక్టర్ చేసేందుకు భారీగానే డిమాండ్ చేసిందని, బేరసారాల అనంతరం చివరకు ఆమెనే ఫైనల్ చేశారనేది లేటెస్ట్ టాక్. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న 'అంధాదున్' తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. భీష్మ సినిమాతో 2020 సంవత్సరానికి శుభారంభం చేసిన నితిన్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టడం విశేషం. Also Read:


from https://ift.tt/3a6AcdF

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages