దానికి కారణం మా నాన్నే.. జెనీలియాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 14 April 2020

దానికి కారణం మా నాన్నే.. జెనీలియాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం విధించిన హోమ్ క్వారంటైన్ సమయంలో తమ తమ సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు సినీ నటులు. ఈ మేరకు అప్పట్లో చేసిన సినిమా తాలూకు విశేషాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో తన 'ఢీ' మూవీ సంగతులను గుర్తుచేసుకున్నారు. హీరోయిన్ జెనీలియా, డైరెక్టర్ శ్రీనువైట్లతో సరదా సంభాషణ చేశారు. 2007 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన విడుదలైంది ఢీ మూవీ. దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించారు. అప్పట్లో టాలీవుడ్‌లో సంచలన విజయం నమోదు చేసింది 'ఢీ' మూవీ. అయితే ఈ సినిమా విడుదలై 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ డైరెక్టర్ శ్రీను వైట్లను 'ఢీ2' ఎప్పుడు? అని ప్రశ్నించారు మంచు విష్ణు. ఈ సినిమా విడుదల కావడానికి కారణం నాన్న మోహన్ బాబు అని తెలిపిన మంచు విష్ణు.. ఆ రోజు చిత్రయూనిట్ అందరి ముఖాల్లో ఆనంద భాష్పాలు చూశానని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన జెనీలియా 'నేను కూడా అక్కడ ఉన్నట్టు నీకు గుర్తుందా' అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు బదులిచ్చిన మంచు విష్ణు.. ''ఈ ఫొటో చూశావా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిన్ను మరచిపోలేను'' అని పేర్కొన్నారు. Also Read: మరోవైపు ఇదే ఢీ సినిమా గురించి ట్వీట్ చేసిన శ్రీను వైట్ల.. ''ఈ మూవీ నా కెరీర్‌లో స్పెషల్ మూవీ. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా అందరి సహకారంతో సులభంగా షూట్ చేసాం. నిర్మాత MSN రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు'' అని తెలిపారు.


from https://ift.tt/34DeyN8

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages