దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను.. నా భర్తకు కరోనా లక్షణాలు: శ్రియ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday, 14 April 2020

దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను.. నా భర్తకు కరోనా లక్షణాలు: శ్రియ

టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ ప్రస్తుతం స్పెయిన్‌లోని బార్సిలోనాలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిన దేశాల్లో స్పెయిన్ ఒకటి. అక్కడ ప్రస్తుతం కోవిడ్-19 పాజిటివ్ కేసులు 1.7 లక్షలుపైగా నమోదయ్యాయి. అలాగే, 17వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పీడిత దేశాల్లో ప్రస్తుతం స్పెయిన్ రెండో స్థానంలో ఉందంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దేశంలో ప్రస్తుతం శ్రియ ఉన్నారు. అంతేకాదు, తన భర్త ఆండ్రీ కొశ్చీవ్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో చాలా కంగారు పడ్డారట. ప్రస్తుతం తామిద్దరం వేర్వేరు గదుల్లో ఉంటున్నామని చెప్పారామె. ఈ మేరకు ‘బోంబే టైమ్స్’తో ఆమె మాట్లాడారు. ‘‘బార్సిలోనాలో సుమారు నెల రోజులుగా నేను లాక్‌డౌన్‌లో ఉన్నాను. కోవిడ్-19 వచ్చిన తరవాత నా చుట్టూ పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయే తలుచుకుంటేనే భయమేస్తోంది. కరోనా విజృంభన ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన స్పెయిన్‌లో ఉంటూ ఈ వైరస్ వల్ల మన జీవితాలు ఎంత త్వరగా తలకిందులయ్యాయో చూస్తున్నాను. మార్చి 13న నేను, ఆండ్రీ (భర్త) మా పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి బయటికి వెళ్లాం. అప్పటికి ఇంకా కరోనావైరస్ వ్యాపించలేదు. రెస్టారెంట్‌లో మేం సీట్స్ రిజర్వ్ చేసుకున్నాం. అయితే, ఆ రెస్టారెంట్‌ను మూసేశారు. దీంతో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని మాకు అర్థమైంది. స్పెయిన్ మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంటిలో నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి రావడానికి అనుమతిస్తూ పోలీసులు నిబంధన పెట్టారు. అది కూడా తప్పనిసరి అయితే మాత్రమే. నిజానికి నేను, ఆండ్రీ కలిసి వెళ్తుండగా పోలీసులు మమ్మల్ని ఆపారు. కానీ, ఆయన వైట్.. నేను బ్రౌన్. దీంతో మేమిద్దం భార్యభర్తలం కాదని వారు అనుకున్నారు. మేం వేర్వేరు వ్యక్తులమని అనుకొని వదిలేశారు. రోజురోజుకి పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయని వార్తలు చదవడం మొదలుపెట్టాను. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఆండ్రీకి పొడి దగ్గు, జ్వరం వచ్చాయి. వెంటనే మేం హాస్పిటల్‌కు వెళ్లాం. డాక్టర్లు పరీక్షించి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పారు. ‘ఒకవేళ ఈయనకు కోవిడ్-19 లేకపోయినా, ఇక్కడే ఉంటే కచ్చితంగా సోకుతుంది’ అని డాక్టర్లు మాకు చెప్పారు. దీంతో ఇంటికి వెళ్లిపోయి మాకు మేం నిర్బంధంలో ఉండాలని, ఇంటి వద్దే ట్రీట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి వేర్వేరు గదుల్లోనే పడుకుంటున్నాం. ఇద్దరికీ మధ్య దూరం పాటిస్తున్నాం. దేవుడి దయవల్ల ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు’’ అని శ్రియ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇండియాను మిస్ అవుతున్నానని చెప్పిన శ్రియ.. మళ్లీ తన జన్మభూమిలో ఎప్పుడు అడుగుపెడతానో తెలియడం లేదని అన్నారు. ‘‘నా తల్లిదండ్రులు ముంబైలో ఉన్నారు. నేను తరుచుగా వాళ్లతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నాను. మా అమ్మ కొన్ని వంటకాలను ఎలా చేయాలో నాకు నేర్పిస్తున్నారు. కానీ, ప్రస్తుతం నా దగ్గర మసాలా దినుసులు నిండుకున్నాయి. ఇక దేశీ ఫుడ్ తినలేనేమో అని నాకు భయమేస్తోంది’’ అని శ్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ఉపాధిని కోల్పోయారని, చాలా మంది తమ కుటుంబానికి దూరంగా ఒంటరిగా హాస్టల్స్‌లో ఉండిపోయారని శ్రియ అన్నారు. కాబట్టి, వారి కోసం ప్రతిరోజూ రాత్రి ఒక కొవ్వొత్తిని వెలిగించాలని, బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొట్టాలని సూచించారు. వీలైతే అలాంటి వారికి ఏదైనా సాయం చేయాలని అన్నారు.


from https://ift.tt/2XFwzZo

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages