మహేశ్ బాబు మరో కొత్త బిజినెస్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 13 April 2020

మహేశ్ బాబు మరో కొత్త బిజినెస్

వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్న ... బిజినెస్‌లో కూడా అదే దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటికే మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ప్రవేశించి రాణిస్తున్నటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ తాజాగా మరో వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. తాజాగా ఆయన డిజిటల్ ప్లాట్ ఫామ్ వ్యాపారంలోకి కూడా దిగబోతున్నారని సమాచారం. ముంబైలోని ఓ పెద్ద నిర్మాణ సంస్థతో ఈ మేరకు చర్చలు ప్రారంభమయ్యాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల కాలంలో ఓటీటీ (ఓవర్ ది టాప్) మీడియా సర్వీసెస్ వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సైతం 'ఆహా' అనే పేరుతో డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించారు. ఇక ఇప్పుడు మహేశ్ సైతం అదే రంగంలోకి దిగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. హీరో మహేశ్ బాబు, ఇప్పటికే సినిమా థియేటర్స్, టెక్స్ టైల్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకమంది సినీ నటులు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ రౌడీ పేరిట సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించగా, బాలివుడ్ లో హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, సన్నీ లియోన్ సైతం సొంతంగా వస్త్రాల బ్రాండ్ ద్వారా వ్యాపారం రంగంలో ప్రవేశించారు. అటు హీరోయిన్స్ కూడా అనేక రకాల బిజినెస్‌లు ప్రారంభిస్తున్నారు. తమన్నా గోల్డ్ బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కాజల్ కూడా ముంబైలో నగల దుకాణాన్ని ప్రారంభించింది. దీంతో ఇప్పుడు తారలంతా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే పనిలో పడుతున్నారు. అందుకే ఓవైపు సినిమాలు చేస్తూనే...మరోవైపు వ్యాపారాల్ని కూడా విస్తరించేసుకుంటున్నారు.


from https://ift.tt/3chqG96

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages