బాలకృష్ణ సినిమాలో విలన్‌గా పవన్ కళ్యాణ్ హీరోయిన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

బాలకృష్ణ సినిమాలో విలన్‌గా పవన్ కళ్యాణ్ హీరోయిన్

నటసింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్‌లో కొత్త సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఓ లేడీ స్టార్‌ను వెతుకుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్రకు ముందుగా రోజా అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరో పేరు వినిపిస్తోంది. బాలయ్య సినిమాలో విలన్‌గా పవన్ కళ్యాణ్‌తో ఖుషి సినిమాలో జత కట్టి సూపర్ డూపర్ హిట్ కొట్టిన భూమిక చావ్లా పేరు ప్రస్తావనకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సరసన ఖుషీ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది భూమిక. ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలతో కూడా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది. చాలా గ్యాప తర్వాత ఎంసీఏ సినిమాలో నానికి వదినగా మనముందుకు వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శీను సినిమాలో భూమిక విలన్‌గా కనిపించనుందనే వార్త ఒకటి ఫిలిం నగర్‌లో హల్ చల్ చేస్తుంది. గతంలో రోజా విలన్‌గా కనిపించనుందని వార్తలు రాగా, దీనిని కొట్టిపారేసింది. దీంతో ఇప్పుడు బాలయ్యకి కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంతటి హిట్ కొట్టాయో అందరికీ తెలిసిందే. దీంతో వీరిద్దరూ హ్యాట్రిక్‌పై కన్నేశారు. తొలి షెడ్యూల్ వారణాశిలో జరగగా, కొద్ది రోజుల క్రితం ఈ షెడ్యూల్ పూర్తి చేశారు. ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్‌లని తొలి షెడ్యూల్‌లో జరిపినట్టు దర్శకుడు బోయపాటి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా తెలిపారు. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా అంజలిని అనుకుంటున్నారు. మరి ఈ విషయాలపై మనకు స్పష్టత రావాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.


from https://ift.tt/2wwkMS9

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages