గడ్డి తింటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

గడ్డి తింటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. దీంతో ఇంటికి పరిమితమైన దేశ ప్రజలు రకరకాల పనులు చేస్తూ తమ సమయాన్ని గడుపుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే తమలో దాగి ఉన్న కొత్త కళల్ని బయటకు తీస్తున్నారు. కొందరు వర్క్ అవుట్లు చేస్తుంటే.. మరికొందరు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకొందరు హీరోయిన్లు ఇంటి పనులు చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్... కొత్తగా ఓ వీడియోను పోస్టు చేశాడు. అందులో గుర్రానికి గడ్డి పెడుతూ... కొంచెం గడ్డిని అతడు కూడా తిన్నాడు. లాక్ డౌన్ విధించిన దగ్గరి నుంచి సల్మాన్ ఖాన్ తన ఫామ్ హౌజ్‌కే పరిమితం అయ్యాడు. దీంతో తన పెంపుడు జంతువులతో లాక్ డౌన్ సమయాన్ని గడిపేస్తున్నాడు. ఉదయం గడ్డి తినిపిస్తూ తను కూడా తినడం నెటిజన్స్‌ని షాక్ కు గురిచేసింది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అంటూ సల్మాన్ పోస్ట్ పెట్టడం, ఆ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేయడం అతని ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆ మధ్య సల్మాన్ కాన్ ఫాం హౌస్‌లో మేనల్లుడితో ఆడుకుంటున్న వీడియోను పోస్టు చేసిన విషయం తెలిసిందే. కరోనా విరామంలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తన సోదరి అర్పితా ఖాన్‌ కొడుకైన అహిల్‌తో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టు చేశాడు సల్మాన్. మొత్తానికి ఖాళీ టైం దొరకడంతో జనాలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. షూటింగ్స్, పార్టీలు, ఫంక్షన్లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే తారలు మాత్రం లాక్ డౌన్ ఫ్రీ టైంలో తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక రకరకాల విన్యాసాలు ప్రయోగాలు చేస్తున్నారు.


from https://ift.tt/3b1gMYJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages