బాబోయ్..! నా భార్య నుంచి త్వరగా రక్షించండి: శ్రీయ భర్త షాకింగ్ కామెంట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

బాబోయ్..! నా భార్య నుంచి త్వరగా రక్షించండి: శ్రీయ భర్త షాకింగ్ కామెంట్

కరోనా విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజానీకం మొదలుకొని సెలబ్రిటీల దాకా అందరూ ఇంటి గడపదాటి బయటకు రావడం లేదు. తమ హోమ్ క్వారంటైన్ సమయాన్ని ఎవరికి తోచిన విధంగా వారు గడిపేస్తూ సరదాగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదేబాటలో కొంటె చేష్టలతో చిలిపి ఆటలతో ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ శ్రీయ. అంతేకాదు ఎప్పటికప్పుడు సదరు వీడియోలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ మేరకు తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా కరోనా పట్ల జాగ్రత్తలు చెప్పారు శ్రీయ దంపతులు. ఇకపోతే శ్రీయ భర్త ఆండ్రు కొశ్చివ్‌.. తనను తన భార్య శ్రీయ నుంచి రక్షించండి అంటూ వేడుకోవడం ఈ వీడియోలో హైలైట్ అవుతోంది. లాక్‌డౌన్ వేళ ఈ భార్యాభర్తల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. Also Read: శ్రీయ, ఆమె భర్త ఆండ్రు కొశ్చివ్‌ ఇద్దరూ కలిసి ప్లకార్డులతో కరోనా పట్ల అవగాహన కల్పించారు. చెరో డిఫరెంట్ డిఫరెంట్ ప్లకార్డులు చూపిస్తూ రొమాంటిక్ వీడియో తయారు చేశారు. ఇందులో ముందుగా శ్రీయ.. ‘సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి’ అనే ప్లకార్డు చూపగా దానికి రిప్లైగా ‘ఈమె నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటుంది’ అనే మరో ప్లకార్డు చూపించారు ఆమె భర్త ఆండ్రు కొశ్చివ్. ఆ తర్వాత మరో ప్లకార్డును చూపించిన శ్రీయ ‘థ్యాంక్ యూ.. నాన్‌స్టాప్‌గా వర్క్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొంది. దానికి బాదుకుగా ‘నన్ను ప్రతీ రోజు నిమిషం తీరిక లేకుండా పని చేయిస్తోంది’ అని ఆమె భర్త ప్లకార్డు ప్రదర్శించాడు. ఇక చివరగా.. కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకొంటూ ఇంట్లోనే ఉండండి, కోవిడ్ 19ను తరిమి కొట్టండి అంటూ శ్రీయ చూపించిన ప్లకార్డుకు రిప్లైగా ‘ఈమె నుంచి నన్ను కాపాడండి, నన్ను బయటపడేసేలా ప్రార్థించండి’ అంటూ ఆమె భర్త మరో ప్లకార్డు చూపించడం జనాల్లో ఆసక్తి కలిగించింది. ఏదేమైనా శ్రీయ పోస్ట్ చేసిన ఈ సిల్లీ అండ్ సరదా వీడియో జనాలకు కరోనా పట్ల అవగాహన కలిగిస్తూనే, ఈ ఖాళీ సమయాన్ని భార్యాభర్తలు ఎలా ఎంజాయ్ చేయొచ్చో తెలిపింది.


from https://ift.tt/3c1GWuK

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages