మాట నిలబెట్టుకున్నావ్.. చాలా గర్వంగా ఉంది: తమన్‌కు బన్నీ ప్రశంస - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

మాట నిలబెట్టుకున్నావ్.. చాలా గర్వంగా ఉంది: తమన్‌కు బన్నీ ప్రశంస

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. నిజానికి ‘అల వైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. తమన్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతమే. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే, తన సినిమాకు ఇంత మంచి ఆల్బమ్ ఇచ్చిన తమన్‌‌ను బన్నీ తాజాగా ప్రశంసించారు. అప్పుడెప్పుడో విడుదలైన సినిమా ఆల్బమ్ గురించి ఇప్పుడు ప్రశంసించడమేంటి అనుకుంటున్నారా? దానికి కారణం ఉంది. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్‌ను ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా సార్లు శ్రోతలు విన్నారు. నిజానికి 100 కోట్ల ప్లే ఔట్స్ వచ్చే ఆల్బమ్‌ను ఇస్తానని బన్నీకి తమన్ మాటిచ్చారట. అందుకే, ఆ విషయాన్ని గుర్తు చేస్తూ బన్నీ ట్వీట్ చేశారు. Also Read: ‘‘ప్రియమైన తమన్. నాకు చాలా గర్వంగా ఉంది. ఇచ్చిన మాట కోసం నువ్వు చాలా కష్టపడతామని అర్థమైంది. ‘అల వైకుంఠపురములో’ ప్రారంభంకావడానికి ముందు ఒక బిలియన్‌కు పైగా ప్లే ఔట్స్‌ వచ్చే ఆల్బమ్‌ కావాలి అని నేను అడిగాను. ‘తప్పకుండా ఇస్తాను బ్రదర్ ప్రామిస్’ అని నువ్వు చెప్పావు. ఈరోజు ఆ ఆల్బమ్ 1.13 బిలియన్‌ దాటేసింది. థాంక్యూ’’ అని అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘మాట మీద నిలబడే మనిషి’ అని తమన్‌కు బిరుదు కూడా ఇచ్చారు బన్నీ.


from https://ift.tt/34tKcMS

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages