పుష్ప: సుకుమార్ ‘స్పెషల్’ స్కెచ్.. బన్నీ కోసం బాలీవుడ్ బ్యూటీ! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

పుష్ప: సుకుమార్ ‘స్పెషల్’ స్కెచ్.. బన్నీ కోసం బాలీవుడ్ బ్యూటీ!

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ పరంగా, నటన పరంగా తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. ఆ వెంటనే తిరిగి బాలీవుడ్ బాటపట్టిన కియారా, అక్కడ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. అయితే తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా కోసం కియారా అద్వానీ పేరు పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. అదేంటి.. ఇప్పటికే ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోందిగా! మళ్ళీ కియారా అంటున్నారేంటి? అనే సందేహం కలుగుతోంది కదూ. అదేనండీ నేటితరం సినిమాల్లో ఐటెం సాంగ్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంటోందిగా. ఆ ఐటెం సాంగ్ కోసమే కియారా అద్వానీని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యారట డైరెక్టర్ సుకుమార్. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరున్న సుకుమార్ తన సినిమాల్లో ఐటెం సాంగ్స్ హోరెత్తిస్తుంటారు. అదే కంటిన్యూ చేస్తూ అల్లు అర్జున్‌తో రూపొందిస్తున్న ‘పుష్ప’ మూవీ కోసం స్పెషల్ అప్పియరెన్స్‌గా కియారాను చూపించేలా ప్లాన్ చేశారట సుక్కు. Also Read: గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ కథ సాగుతుంది. ఇటీవలే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ పోస్టర్‌లో కాలికి ఆరోవేలుతో పూర్తి డిఫరెంట్ స్టైల్‌లో బన్నీ కనిపించారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడిని చూపించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏదేమైనా ‘రంగస్థలం’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సుకుమార్ ‘పుష్ప’ మూవీతో రికార్డులు తిరగరాయాలని పకడ్బందీ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు.


from https://ift.tt/2JXx616

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages