ఇప్పుడు అంత అవసరమా.. స్టార్ హీరోయిన్‌కు రష్మి కౌంటర్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 11 April 2020

ఇప్పుడు అంత అవసరమా.. స్టార్ హీరోయిన్‌కు రష్మి కౌంటర్

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ లాక్‌డౌన్ పీరియడ్‌ను సెలబ్రిటీలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్వారంటైన్ టైమ్‌ను ఎలా గడపాలో తెలియక ఇంట్లో వంటలు చేస్తూ వాటిని ట్రై చేయమని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఇదే పని చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ అహుజ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. తాను చాకోలెట్ వాల్‌నట్ కేక్ తయారు చేశానని పేర్కొన్నారు. అయితే, తన దగ్గర చాకోలెట్ నిండుకోవడంతో ‘ఫార్చ్యూన్ గౌర్మెట్ ఇండియా’ సంస్థ మంచి నాణ్యత కలిగిన చాకోలెట్‌ను తనకు పంపిందని వెల్లడించారు. ఈ సంస్థను నడుపోతన్న దేవికి ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే, ఇదే విషయాన్ని సోనమ్ ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ పేస్ట్ చేశారు. అయితే, సోనమ్ ట్వీట్‌కు యాంకర్ రష్మి కౌంటర్ ఇచ్చారు. సోనమ్‌కు చాక్లెట్ పంపిన కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటివి చేయడం గొప్ప విషయమే.. కానీ, బాధ్యత కూడా ఉండాలి. చాకోలెట్ డెలివరీ కోసం ప్రజల్ని బయట తిప్పడం ఈ సమయంలో అంత ముఖ్యమా. అంతేకాదు, మీరు చేసిన పని వల్ల తమ ఫేవరేట్ సెలబ్రిటీ చేసినట్టు తాము కూడా కేక్‌ను బేక్ చేయాలని వాటి తయారీ పదార్థాల కోసం స్టోర్లకు పరిగెడతారు’’ అని రష్మి వాయించేశారు. అయితే, రష్మి ఇచ్చిన కౌంటర్‌కు నెటిజన్ల నుంచి పెద్దగా మద్దతు రావడంలేదు. అంతేకాదు, సోనమ్ ఫ్యాన్స్ కొంత మంది రష్మిపై కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే, అసలు సోనమ్ కపూర్ ఏదో ఫ్యాన్స్ కోసం ఆ పోస్ట్ పెట్టలేదు. అది కూడా బిజినెస్‌లో బాగమే. ఫార్చ్యూన్ గౌర్మెట్ ఇండియా కంపెనీ ఫుడ్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. దానికి ఈ విధంగా ప్రచారం కల్పిస్తున్నారు సోనమ్. అందుకే, తన పోస్ట్‌లో ఆ కంపెనీ పేరును ప్రస్తావించారు, క్వాలిటీ చాకోలెట్ డెలివరీ చేశారని ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రచారాలు సెలబ్రిటీలకు కామన్ కదా!


from https://ift.tt/2V0wPAD

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages