అందుకే అయ్యగారికి అంత క్రేజ్.. అఖిల్ బీస్ట్ మోడ్ లుక్ వైరల్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday, 27 December 2021

అందుకే అయ్యగారికి అంత క్రేజ్.. అఖిల్ బీస్ట్ మోడ్ లుక్ వైరల్

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కి ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఈ సినిమాతో తొలి హిట్ అందుకున్న అఖిల్.. మాస్ ఇమేజ్ కోసం పరితపించుకుండా ప్యూర్ లవ్ స్టోరీ‌లో నటించి ఆడియన్స్‌ని మెప్పించారు. కెరీర్‌లో ప్రారంభంలో చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు అంతగా వర్కవుట్ కాకపోవడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఇక మాస్ ఇమేజ్ కోసం పరితపించుకుండా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ ఫుల్ లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టేశాడు. అలా పూజా హెగ్డేతో కలిసి అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అఖిల్‌కు ఇంత కాలానికి ఓ హిట్ వచ్చింది. ఇక నుంచి అఖిల్ హిట్ల మీద హిట్లు కొట్టేసేలానే ఉన్నాడు. ఎందుకంటే కథలను ఎంచుకునే తీరు మారింది. కథలు, పాత్రల కోసం అఖిల్ పూర్తిగా మారిపోతోన్నాడు. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా అఖిల్ తన లుక్కును పూర్తిగా మార్చేసుకున్నాడు. అఖిల్ తాజాగా తన లుక్కుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అందులో అఖిల్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంతో అఖిల్ కిల్లింగ్ లుక్‌లో ఉన్నాడు. కండలను చూపిస్తూ అయ్యగారి సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. అయ్యగారే నెంబర్ వన్ అంటూ అఖిల్ ఫోటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మొత్తానికి అఖిల్ మాత్రం ఇప్పుడు ఏజెంట్ కోసం ఎంత కష్టపడుతున్నాడో అందరికీ తెలిసేలా చేస్తున్నాడు. ఇది కచ్చితంగా అఖిల్ కెరీర్‌లో ది బెస్ట్ సినిమా అయ్యేలా ఉంది.


from https://ift.tt/316NecM

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages