బ్రెస్ట్ క్యాన్సర్‌తో నటి పోరాటం.. ప్రేమతో మరింత బలం.. హంసా నందిని సుధీర్ఘమైన పోస్ట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 25 December 2021

బ్రెస్ట్ క్యాన్సర్‌తో నటి పోరాటం.. ప్రేమతో మరింత బలం.. హంసా నందిని సుధీర్ఘమైన పోస్ట్

నటి, హీరోయిన్ ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై సుధీర్ఘమైన పోస్ట్ చేశారు. క్యాన్సర్ వచ్చిందని తెలియడంతో ఆమెపై అభిమానులు ప్రేమను కురిపించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. జీవితం నా మీదకు ఎన్ని రకాల రాళ్లను విసిరినా సరే, ఎలాంటి అన్యాయం చేసినా కూడా నేను మాత్రం బాధితురాలిగా మిగిలిపోకూడదని నిర్ణయించుకున్నాను. నెగెటివిటీ, భయాలతో బతకాలని అనుకోవడం లేదు. ఆశలను వదులుకోకుండా ఉంటున్నాను. ప్రేమ, ధైర్యంతోనే ఇంకా ముందుకు వెళ్తాను. నాలుగు నెలల క్రితం నాకు ఎద భాగంలో ఏదో తెలియని నొప్పి ఏర్పడింది. ఇకపై నా జీవితం సాఫీగా ఉండబోదని నాకు అర్థమైంది. 18 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయారు. భయంకరమైన వ్యాధితో ఆమె మరణించారు. అప్పటి నుంచి నేను భయంతోనే బతుకుతూ వచ్చాను. అలా నొప్పి వచ్చిన కొన్ని గంటల్లోనే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాను. ఏది జరగొద్దని భావించానో అదే జరిగింది. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఆ వెంటనే ఎంతో ధైర్యంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ట్యూమర్‌ను తొలగించారు. చాలా లక్కీ.. తొందరగా గుర్తించావ్.. ఇంకా మిగతా భాగాలకు స్ప్రెడ్ అవ్వకముందే తొలించేశామని డాకర్లు అన్నారు. అలా డాక్టర్ల మాటలతో వచ్చిన ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. వారసత్వంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టుల్లో నాకు పాజిటివ్ వచ్చింది. 70 శాతం మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, 45 శాతం నా జీవితాంతం కూడా క్యాన్సర్ వెంటాడుతూ ఉందని తెలిసింది. ఇక వీటిని జయించాలంటే సర్జరీలు చేయించుకోవాల్సిందే. ఇప్పటికి నాకు తొమ్మిది సార్లు కీమో థెరపీలు జరిగాయి. ఇంకా ఏడు సార్లు చేయించుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోపే నాకు నేనుగా కొన్ని వాగ్దానాలు చేసుకున్నాను. ఈ వ్యాధి వల్ల నా జీవితం తలకిందులైపోకూడదు.. నవ్వుతోనే వీటిని ఎదురించి గెలుస్తాను. మళ్లీ తెరపై మునుపటి కంటే గొప్పగా వెలిగిపోతాను. నా కథను అందరికీ చెప్పి.. స్పూర్తినింపుతాను. జీవితాన్ని ఆనందిస్తూ గడుపుతాను.. నేను ఎక్కువగా అందుబాటులో ఉండటం లేదని అందరూ మెసెజ్‌లు చేస్తున్నారు. నా గురించి ఆలోచిస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అద్భుతమైన వైద్య బృందం పర్యవేక్షణలోనే నేను ఉన్నాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సినిమా మిత్రులు అందిస్తున్న ప్రేమతో ఇంకాస్త బలంగా పోరాడుతాను అని హంసా నందిని పోస్ట్ చేశారు. అలా నాలుగు రోజుల క్రితం హంసా నందిని చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్అయింది. ఇక హంసా నందిని పరిస్థితి తెలిసిన అభిమానులు ఆమె కోసం ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీయడం ఆరంభించారు. దీంతో మరోసారి హంసా నందిని స్పందించారు. నా గురించి ఆలోచిస్తూ, ప్రార్థనలు చేస్తూ, నాలో ధైర్యాన్ని నింపుతున్న వారందరికీ థ్యాంక్స్. ఇలాంటి కష్టకాలంలో మీ ప్రేమ నన్ను మాటల్లో చెప్పలేనంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ యుద్దంలో నేను ఒంటరిని కాదు అని మీరు నిరూపించారు. ప్రతీ ఒక్కరూ నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ పట్ల నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రేమతో నాలో మరింత బలం పెరిగింది అంటూ హంసా నందిని ఎమోషనల్ అయింది.


from https://ift.tt/3132es8

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages