మెగా ఫ్రేమ్‌పై మంచు లక్ష్మి రియాక్షన్ వైరల్.. ఆ పిక్ చూశాక నెటిజన్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే..! - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Sunday, 26 December 2021

మెగా ఫ్రేమ్‌పై మంచు లక్ష్మి రియాక్షన్ వైరల్.. ఆ పిక్ చూశాక నెటిజన్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే..!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది తెలుగు తెరకు పరిచయమయ్యారు. మెగా బ్రాండ్‌కి వారి వారి టాలెంట్ యాడ్ చేసి ఎవరికివారు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. అయితే బయట ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటీకీ ఫ్యామిలీ పరంగా ఏకంగా ఉంటూ ప్రతి పండగ రోజున, స్పెషల్ డే రోజున మీట్ కావడం మెగా కుటుంబానికి అలవాటు. ఇలా ఇప్పటికే పలుసార్లు మీట్ అయిన మెగా హీరోలు మరోసారి క్రిస్టమస్ సందర్భంగా కలుసుకొని ఎంజాయ్ చేశారు. మెగా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్టమస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలోని యంగ్ జనరేషన్ హీరోలంతా ఒక్క చోట కెమెరాకు పోజిచ్చారు. ఈ ఫొటోను అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా కొన్ని నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, నిహారిక భర్త చైతన్య సహా వారి కజిన్స్ కనిపించారు. దీంతో ఈ పిక్‌ చూసి కన్నుల పండగగా ఫీల్ అవుతున్న మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ పిక్ చూసి మంచువారమ్మాయి, నటి క్రేజీగా రియాక్ట్ అయింది. ''ఎన్నో నవ్వులతో కూడిన బ్యూటిఫుల్ పిక్ ఇది. ఈ ఫొటోకి భారీ రెస్పాన్స్ రావాలి'' అని కామెంట్ చేసింది. ఈ మేరకు లవ్ సింబల్ ఎమోజీ పోస్ట్ చేసి మెగా జనరేషన్‌పై తన ఇష్టాన్ని బయటపెట్టింది మంచు లక్ష్మి. ఇక ఇదిలాఉంటే ఈ మెగా ఫ్రేమ్‌లో శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్, అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ లేకపోవడం పాయింట్ అవుట్ చేస్తున్న నెటిజన్లు.. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా ఉంటే ఈ ఫ్రేమ్ ఇంకా అదిరిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. మెగా జనరేషన్‌తో క్లోజ్‌గా ఉండే అకీరా ఎందుకు మిస్సయ్యాడు అంటూ ప్రశ్నిస్తున్నారు.


from https://ift.tt/32w9IEi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages