Pushpa: తగ్గేదే లే అంటూ పుష్ప రిలీజ్‌పై అఫీషియల్ స్టేట్‌మెంట్.. బన్నీ ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday 3 August 2021

Pushpa: తగ్గేదే లే అంటూ పుష్ప రిలీజ్‌పై అఫీషియల్ స్టేట్‌మెంట్.. బన్నీ ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్

స్టైలిష్ స్టార్ , క్రియేటివ్ డైరెక్టర్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా 'పుష్ప'. ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బన్నీ మాస్ అప్పీయరెన్స్ వెండితెరపై చూడాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర రిలీజ్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. క్రిస్మస్ కానుకగా రాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడని, డిసెంబర్ నెలలో పుష్ప పార్ట్- 1 రిలీజ్ కానుందని పేర్కొంటూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలోనే పుష్ప రిలీజ్ ఉండేది. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన యూనిట్.. కరోనా కారణంగా షూటింగ్‌కి బ్రేక్స్ పడటంతో విడుదలను వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా 'పుష్ప' తొలి భాగం డిసెంబర్ నెలలో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ రిలీజ్ పోస్టర్ వదిలారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో క్లాస్, మాస్ ఆడియన్స్ ఫిదా అయ్యేలా కథను ఆవిష్కరించబోతున్నారు సుకుమార్. రెండు భాగాలుగా రాబోతున్న ఈ భారీ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఇక ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ను ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.


from https://ift.tt/3fsLmPl

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages