ఒకప్పుడు ఒలింపిక్స్ అంటే మనవాళ్లు ఖాళీ చేతులతో వెనక్కి వస్తారు.. ఎలాంటి పతకాలు సాధించలేరు అనే ఓ భ్రమ ఉండేది. కానీ, ఈ ఏడాది దాన్ని పూర్తిగా మార్చేశారు మన క్రీడాకారులు. చాలా మంది తన ప్రతిభతో సెమీ ఫైనల్స్ వరకూ వచ్చారు. అయితే అందులో కొందరు పోరాడి విజయం సాధించి రజతం సాధించగా.. ఆ దశలో విఫలమై.. మరికొందరు కాంస్య పతకానికి పరిమితమయ్యారు. అయితే ఇదంతా ఒక ఎత్తు.. ఈ రోజు జావిలెన్ త్రో క్రీడాకారుడు సాధించిన ఘనత మరో ఎత్తు. జావిలెన్ త్రో క్వాలిఫయర్ రౌండ్‌లోనే 86.59 మీటర్లు జావెలిన్ త్రోని విసిరి ఫైనల్‌కి అర్హత సాధించారు. ఇక శనివారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో ఇతర క్రీడాకారులు ఎవరు నీరజ్‌కు చేరువలోకి కూడా రాలేకపోయారు. ఫైనల్ ఈవెంట్‌లో రెండో రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేశారు నీరజ్.. జావిలిన్‌ని 87.58మీ విసిరి రికార్లు సృష్టించారు. అయితే ఆ తర్వాత జరిగిన రౌండర్లలో ఆయన ప్రదర్శన కాస్త తగ్గిన రెండో రౌండ్లో చేసిన ప్రదర్శన ఈ ఒలింపిక్స్‌కి రికార్డు కావడంతో ఆయన్ను స్వర్ణ పతకం వరించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి నుంచి సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ నీరజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన చేసిన ప్రదర్శన మొత్తం జాతికే గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు. ‘అథ్లెటిక్స్‌లో ఇది భారత్‌కు మొదటి గోల్డ్. ఇది ఎంతో ఉత్తేజభరితమైన, గర్వమైన క్షణం. నీరజ్ చోప్రా.. ఈ పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ మహేష్ బాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవీ కూడా నీరజ్‌ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన చరిత్ర సృష్టించడమే కాదు.. తిరగ రాశారు అంటూ ఆయన పేర్కొన్నారు.
from https://ift.tt/2VCxETc
No comments:
Post a Comment