టోక్యో ఒలింపిక్స్‌లో యువ అథ్లెట్ చరిత్ర సృష్టించారు. దాదాపు 100 సంవత్సరాల నుంచి భారత ప్రజలు కంటున్న కలని ఆయన నిజం చేశారు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న 23ఏళ్ల నీరజ్ చోప్రా.. జావిలెన్ త్రో ఈవెంట్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకం సాధించారు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 86.59 మీటర్లు జావెలిన్ త్రోని విసిరి ఫైనల్‌కి అర్హత సాధించారు. ఇక శనివారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో ఇతర క్రీడాకారులు ఎవరు నీరజ్‌కు చేరువలోకి కూడా రాలేకపోయారు. ఫస్ట్ ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్‌ని విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58మీ, మూడో ప్రయత్నంలో 76.93మీ విసిరారు. నాలుగో ప్రయత్నంలోనూ 80మీ దగ్గరగా జావెలిన్‌ని నీరజ్ చోప్రా విసిరారు. ఆ తర్వాతి రెండు ప్రయత్నాల్లోనూ నీరజ్ కాస్త తక్కవ స్కోర్ సాధించగా.. ఆయన రెండో రౌండ్‌లో సాధించిన 87.58 మీటర్ల ఈ ఒలింపిక్స్‌లోనే రికార్డు కావడంతో బంగారు పతకాన్ని గెలుపొందారు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా తర్వాత ఇది వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం కావడం విశేషం. అంతేకాక.. అథ్లెటిక్స్ విభాగంలో ఇది ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు నీరజ్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ కూడా నీరజ్‌ని అభినందించుకుంటూ ట్వీట్ చేశారు. ‘ఇది భారత్‌కు నిజంగా ఒక అద్భుతమైన క్షణం. ఈ క్షణం రావడానికి 101 సంవత్సరాలు పట్టింది. నీరజ్ చోప్రా.. నీకు ఇదే నా సలామ్. నువ్వు చరిత్ర రచించడమే కాదు. చరిత్రను తిరగరాశావు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. చిరుతో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కూడా నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు. Sa
from https://ift.tt/3Akbm7t
No comments:
Post a Comment