ప్రమోషన్స్ చేసుకోవడంలో ఒకొక్కరు ఒక్కో పద్దతి పాటిస్తుంటారు. కొందరు తమకు దొరికిన అవకాన్ని వినియోగం చేసుకుంటూ ముందు వెళ్తే.. కొందరు మాత్రం ఏదైనా పరిణామం జరిగితే దాన్ని ఆసరాగా తీసుకొని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఏదైనా ఓ పెద్ద విషయం జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకొనే పనిలో ఉంటారు. అలాంటి పనే ఇప్పుడు హీరోయిన్ చేసింది. పోర్నోగ్రాఫీ కేసులు అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మద్దతు తెలుపుతూ ఆమె తాజాగాగా బట్టలు లేకుండా నగ్నంగా లైవ్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అశ్లీల వీడియోల కేసు సంచలనం రేపుతోంది. అశ్లీల చిత్రాలు తీయడంతో పాటు.. వాటిని ఓ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్న నేపథ్యంలో రాజ్ కుంద్రాను గత నెల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టిని కూడా నిర్భందించిన పోలీసులు ఆమెను కూడా విచారణ చేశారు. ఈ విచారణలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో చాలా మంది వీరికి మద్దతు ఇస్తున్నారు. తాజాగా నటి గెహనా వశిస్ట్ అనుకొని రేంజ్‌లో రాజ్ కుంద్రాకు మద్దతు తెలిపింది. నగ్నంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి.. ఆమె అందరికీ షాక్ ఇచ్చింది. ‘బట్టలు లేకుండా లైవ్ ఇది. అయితే ఇది పోర్న్ కాదు. కానీ, కొన్నిసార్లు బట్టలు వేసుకున్నా.. దాన్ని కొందరు పోర్న్ అనుకుంటారు. ఇది కపటత్వంతో చివరి దశ’ అంటూ ఆమె పేర్కొంది. అయితే ఇంత దారుణంగా వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఉందంటూ గెహనాపై ఫాలోవర్లు కామెంట్ చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఆమె ఇలా చేసింది అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
from https://ift.tt/3rSt6Up
No comments:
Post a Comment