తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుండటం చూస్తున్నాం. సాధారణంగా ఇతర స్టార్లపై కామెంట్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే ఆమె.. తాజాగా జరిగిన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పరిధులు దాటి ప్రవర్తించింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటులను ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసి చిక్కుల్లో పడింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్లే తనకు మంచి అవకాశాలు రావడం లేదని, వాళ్ళను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలంటూ మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఓ దర్శకుడు పబ్లిసిటీ కోసం తన ఫొటోను పర్మిషన్ లేకుండా వాడుకోవడాన్ని తప్పుపట్టిన మీరా మిథున్.. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి పద్ధతులు అస్సలు బాగుండవని చెప్పుకొచ్చింది. దీంతో మీరా చేసిన ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. దళితులను ఇలా కించపరిచి మాట్లాడటం సరికాదంటూ ఆమెపై పలు చోట్ల పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. ఆమెపై ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటిస్ యాక్ట్ క్రింద సెక్షన్ 153A(1)(a), 505(1)(b), 505 (2) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు క్రైం బ్రాంచ్ పోలీసులు. 2017లో 8 థోట్టక్కల్ సినిమాతో తమిళ సినిమా రంగానికి పరిచయం అయిన మీరా మిథున్.. ఆ తర్వాత సూర్యతో తానా స్నెందా కొట్టమ్, భోదయ్ యేరి భుదీ మారి, డ్రీమ్ నైట్స్ లాంటి చిత్రాల్లో నటించింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 3తో ఫేమ్ అయింది. కొద్ది రోజుల క్రితం త్రిష కృష్ణన్, విజయ్ సూర్య లాంటి ప్రముఖులను టార్గెట్ చేస్తూ నెపోటిజం, ఫేవరిటజం లాంటి ఆరోపణలు చేసింది మీరా.
from https://ift.tt/3ApHcQp
No comments:
Post a Comment