రియల్ హీరో శివ కార్తికేయన్.. పేద యువతి కలను నిజం చేసిన ‘సీమ రాజా’ - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 21 November 2020

రియల్ హీరో శివ కార్తికేయన్.. పేద యువతి కలను నిజం చేసిన ‘సీమ రాజా’

కొంతమంది హీరోలు సినిమాల్లోనే కాదు బయట కూడా తాము హీరోలమేనని నిరూపించుకుంటుంటారు. ఈ కోవలోకే వస్తారు తమిళ హీరో శివ కార్తికేయన్. టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి హీరోగా మారారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆదుకోవడానికి ఆయన ముందు వరుసలో నిలబడతారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్ కావాలన్న ఓ పేదింటి విద్యార్థిని కలను నెరవేర్చారాయన. వివరాల్లోకి వెళ్తే... తంజావూర్‌ జిల్లా పేరావురణి సమీపంలోని పూకొల్లై ప్రాంతానికి చెందిన దంపతులు గణేషన్, చిత్ర దంపతులు కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కుమార్తె సహానా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌ టూ వరకు చదువుకుంది. 2018లో వచ్చిన గజ తుఫాను కారణంగా వీరి ఇల్లు కూలిపోవడంతో వీధి లైట్ల కిందే సహానా చదువుకునేది. అయినప్పటికీ ఏకంగా 524 మార్కులతో ప్లస్‌ టూ ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. Also Red: దీంతో గతేడాది ఏప్రిల్ 25వ తేదీన ఓ తమిళ పత్రికలో వెలువడిన కథనం సహానా జీవితాన్ని మార్చేసింది. ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న తంజావూర్‌ కలెక్టర్‌ అన్నాదురై ఆమె ఇంటికి వెళ్లి రెండు సోలార్‌ లైట్లతో పాటు ఇతర ఖర్చులు రూ.10 వేలు సాయం చేశారు. ఈ విషయం శివకార్తికేయన్‌ దృష్టికి రావడంతో తంజావూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమెకు నీట్ కోచింగ్ ఇప్పించారు. ఇటీవల జరిగిన నీట్‌ పరీక్షలో సహానా 273 మార్కులను సాధించి తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కించుకుంది. Also Red: ఈ సందర్భంగా సహానా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శివ కార్తికేయన్‌కు ధన్యవాదాలు తెలిపింది. డాక్టర్ కావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు ఆయన చేస్తున్న సాయాన్ని జీవితంలో మరిచిపోనని చెప్పింది. తన వైద్య విద్యకు అయ్యే ఖర్చునే ఆయనే భరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించడం కూడా తన డాక్టర్‌ కల సాకారానికి సాయపడిందని సహానా పేర్కొంది. ఓ పేద విద్యార్థిని కలను నెరవేర్చేందుకు శివ కార్తికేయన్ చేసిన సాయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


from https://ift.tt/2HmhC8W

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages