వెబ్ సిరీస్‌లో హృతిక్‌ రోషన్‌!... రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 21 November 2020

వెబ్ సిరీస్‌లో హృతిక్‌ రోషన్‌!... రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం

మన దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేగం పుంజుకుంది. ప్రేక్షకులు సినిమాల కంటే వెబ్‌ సిరీసులు చూడటానికే ప్రాధాన్యత ఇవ్వడంతో సినీతారలు సైతం వాటిలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఈ మార్గం వైపు వస్తున్నారు. గ్రీక్ గాడ్‌గా అభిమానులతో ముద్దుగా పిలిపించుకునే హీరో హృతిక్‌ రోషన్‌ కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ప్లాన్ చేస్తోందని, ఇందులో హృతిక్‌ రోషన్‌ కీలక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ వెబ్ సిరీస్‌ కోసం హృతిక్‌కు ఏకంగా రూ.90కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. ఇందులో దిశా పటానీ కూడా నటించనున్నట్లు సమాచారం. డిసెంబర్‌ నుంచి ఈ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్లు ఇస్తుంటే మిగతా స్టార్ హీరోలందరూ కూడా ఓటీటీ బాట పడతారేమో..


from https://ift.tt/3pS2WA0

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages