‘అంటే సుందరానికీ’.. నాని భలే ఉన్నాడుగా, వీడియో అదిరింది - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Saturday, 21 November 2020

‘అంటే సుందరానికీ’.. నాని భలే ఉన్నాడుగా, వీడియో అదిరింది

నేచురల్ స్టార్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. ‘’ అనే వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్, సర్ ప్రైజ్ వీడియోని విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకుడు. ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్‌ ఆత్రేయ ఇప్పుడు నానితో ‘అంటే సుందరానికి...’ అనే వెరైటీ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. ‘అంటే సుందరానికీ’ అంటూ వదిలిన ఈ టైటిల్ కాన్సెప్ట్ బేస్డ్ వీడియో అదిరిపోయింది. నాని పంచెకట్టు, షర్టుతో ఉండగా.. చేతిలో లగేజ్‌ బ్యాగ్‌, కోటు అంతా చిత్ర విచిత్రంగానే ఉంది. అలాగే సైకిల్‌, షూస్‌, వీణ, కెమెరా, పచ్చళ్ల డబ్బాలు, రాశుల చక్రం, ఫ్లైట్‌ ఇవన్నీ ఆసక్తిరేకెత్తించే విధంగా ఉంది. మొత్తానికి ఇది రొటీన్ సినిమా కాదని ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అర్థం అయ్యేట్టు చేశారు దర్శకుడు. నాని కెరియర్‌లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మూవీ ద్వారా మలయాళ కుట్టీ నజ్రియా టాలీవుడ్‌కి హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుండటం విశేషం. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.


from https://ift.tt/3nOsagR

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages