యువ నటుడు ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సుశాంత్ మరణించి మూడు నెలలు గడిచినా నిజాలు బయటకురాకపోవడం, పైగా రోజులో కొత్త అంశం తెరమీదకు వస్తుండటం జనాన్ని అయోమయంలో పడేస్తోంది. ఈ కేసు విషయమై రంగంలోకి దిగిన సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు లోతైన విచారణ చేపడుతున్న క్రమంలో తాజాగా సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు సంచలన కామెంట్స్ చేసింది. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం అంశం బాగా వైరల్ అయింది. కొందరు బడా దర్శకనిర్మాతలు బ్యాగ్రౌండ్ లేని నటీనటులను తొక్కేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇంతలో ఈ కేసు మరో టర్న్ తీసుకొని అనూహ్యంగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చేసింది. ఇక అప్పటినుంచి డ్రగ్స్ చుట్టే తిరుగుతూ పలువురు సినీ నటుల పేర్లు బయటపడ్డాయంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి తప్పితే అసలు సుశాంత్ మరణానికి కారణం ఏంటనే మ్యాటర్ తెలియడం లేదు. Also Read: ఇక రీసెంట్‌గా 'రేసు గుర్రం' సినిమాలో విలన్‌గా నటించిన ఎంపీ రవికిషన్ పార్లమెంటు సాక్షిగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌కు బానిస అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సమర్ధించింది. అంతేకాకుండా జయాబచ్చన్ దీనికి వ్యతిరేకంగా మాట్లడటం సరికాదని కౌంటర్ వేస్తూ ఈ ఇష్యూను రాజకీయం చేస్తున్నారని, డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని జయప్రద పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూలోకి ఎంటరైన నగ్మ.. బీజేపీ నాయకుల తీరును తప్పుబడుతూ జయప్రదకు కౌంటర్ ఇచ్చింది. ''ఎన్‌సీబీ, ఈడీ, సీబీఐ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో జయప్రద గారికి తెలియజేయండి. ఈ కేసు విషయంలో వివరాల కోసం అందరూ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించడానికే బీజేపీ నేతలు డ్రగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దేశమంతా సుశాంత్కు న్యాయం జరగాలని, ఆయన మరణం వెనుక కారణాలు తెలుసుకోవాలని చూస్తోంది'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది నగ్మ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
from https://ift.tt/2FF13Eu
No comments:
Post a Comment