Prabhas: ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ పండగ చేసుకునే భారీ ప్రకటన - All In One Studios

This Blog We Post all type of contents regaridng tech,gadgets,reviews,games,vedios,paytm,money tricks,etc.

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday 17 August 2020

Prabhas: ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ పండగ చేసుకునే భారీ ప్రకటన

సరిగ్గా చెప్పిన సమయానికే తన సర్‌ప్రైజ్ రివీల్ చేశారు. నేడు (ఆగష్టు 18) ఉదయం 07:11 గంటలకు తన కొత్త సినిమాను ప్రకటించి రెబర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపారు. ‘బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అఫ్ ది డికేడ్’ అని చెబుతున్న ఈ ప్రకటనను ప్రేక్షకుల ముందుంచారు. రేపు ఉదయం 07:11 గంటలకు తన ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నిన్న వెల్లడించిన ప్రభాస్.. భారీ ప్రకటన చేశారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయి పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అప్పటినుంచి ప్రభాస్ కోసం బడా దర్శకనిర్మాతలు క్యూ కట్టడం, బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేయడం జరిగాయి. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో భారీ బాలీవుడ్ సినిమా ప్లాన్ చేశారు. అదే ''. ఈ సినిమానే తాజాగా రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ ప్రకటించారు ప్రభాస్. ''చెడుపై మంచి సాధించే విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుందాం'' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను అనౌన్స్ చేయడం విశేషం. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ 'ఆదిపురుష్' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.


from https://ift.tt/344CaMi

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages