‘జాంబీ రెడ్డి’ అనే వెరైటీ టైటిల్‌తో సినిమాను ప్రకటించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. హీరో ఎవరనే విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘జాంబీ రెడ్డి’ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో గద చేతబట్టి నిలబడిన హీరోని వెనక నుంచి చూపించారు. ఈ హీరో ఎవరో ఊహించి చెప్పాలని నెటిజన్లకు సవాల్ విసిరారు ప్రశాంత్ వర్మ. 50 చిత్రాల్లో నటించిన యువ నటుడు అని క్లూ కూడా ఇచ్చారు. చాలా మంది అల్లరి నరేష్ అని సమాధానం ఇచ్చారు. కానీ, ఆ హీరో అల్లరి నరేష్ కాదు. తన సినిమాలోని హీరోను రిలీవ్ చేస్తూ ఆదివారం (ఆగస్టు 23న) ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు ప్రశాంత్ వర్మ. ‘ఇంద్ర’ చిత్రంలో చిన్నప్పటి చిరంజీవిగా నటించడంతో పాటు సుమారు 50 చిత్రాల్లో బాల నటుడిగా మెప్పి్ంచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న . సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్న తేజ సజ్జా.. ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమవుతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తేజ గద పట్టుకొని ఉండగా, జాంబీలు అతనిపై ఎటాక్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే, వెనకవైపు మెగాస్టార్ చిరంజీవి బొమ్మ ఉన్న షర్ట్ ధరించి స్టైల్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తేజ. అతను మ్యాచో లుక్‌లో కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ నేపథ్య సంగీతంగా చిరంజీవి సూపర్ హిట్ ఫిల్మ్ ‘దొంగ’లోని పాపులర్ సాంగ్ ‘‘కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో’’ మ్యూజిక్‌ను వాడారు. తేజ పుట్టినరోజును పురస్కరించుకొని విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఇంప్రెసివ్‌గా కనిపిస్తున్నాయి. Also Read: టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మరో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మన ముందుకు వస్తున్నారు. ‘ఆ!’ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ.. ‘కల్కి’తో మరో ప్రయోగం చేశారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ‘జాంబీ రెడ్డి’ని వదులుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావడం గమనార్హం. ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు.
from https://ift.tt/3aNizS2
No comments:
Post a Comment