సూపర్ స్టార్ వరుస బ్లాక్ బస్టర్లతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’.. ఇలా ఏడాదికి ఒక హిట్ చొప్పున ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చారు. ఈ ఫామ్‌ను ఇలానే కొనసాగించాలని.. ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ పడకూడదని మహేష్ బాబు భావిస్తున్నారు. అందుకే, ఈ లాక్‌డౌన్ సమయంలో మూడు కథలు విన్న మహేష్.. ఆ మూడింటినీ రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లి, ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో మహేష్ బాబును కలిశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న ఈ ముగ్గురు డైరెక్టర్లు చెప్పిన స్టోరీ లైన్స్, ఐడియాస్ మహేష్‌కు నచ్చలేదని అంటున్నారు. ఈ కథలతో తాను సినిమాలు చేయలేనని.. మరో మంచి కథతో రావాలని ఈ ముగ్గురు దర్శకులకు మహేష్ బాబు చెప్పేశారని సమాచారం. బాక్సాఫీసు వద్ద విజయం సాధించొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చే బౌండ్ స్క్రిప్ట్‌తో డైరెక్టర్ వస్తేనే ఆ సినిమాను సైన్ చేయాలని మహేష్ బాబు భావిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. డైరెక్టర్స్ ట్రాక్ రికార్డ్‌ను కాకుండా స్క్రిప్ట్‌లో బలాన్ని చూస్తున్నారట మహేష్. Also Read: ఇదిలా ఉంటే, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో మహేష్ సినిమా చేయబోతున్నారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మహేష్ కోస రాజమౌళి కథను సిద్ధం చేస్తున్నారని కూడా అన్నారు. ఈ వదంతుల్లో నిజమెంతో తెలీదు కానీ.. వినడానికి అయితే బాగున్నాయి. చూద్దాం ఈ రాజకుమారుడు రాజమౌళితో సినిమా చేస్తారో లేదో. ప్రస్తుతానికి అయితే ‘సర్కారు వారి పాట’తో మహేష్ బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్.
from https://ift.tt/2FGMhN0
No comments:
Post a Comment