తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతమున్న స్టార్ హీరోల్లో నందమూరి తారక రామారావు ఒకరు. మనందరం జూనియర్ ఎన్టీఆర్ అని పిలుచుకుంటోన్న ఈ చిన్న రాముడు.. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారని చాలా మంది అనుకుంటారు. కానీ, బాల నటుడిగా రాముడి పాత్ర పోషించడానికి ముందే ఎన్టీఆర్ తెరపై కనిపించారు. తన తాతయ్య, దిగ్గజ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘బ్రహ్మర్షి విశ్రామిత్ర’లో భరతుడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించారు. ‘నిన్ను చూడాలని’ సినిమాతో సోలో హీరోగా పరిచయమైన ఎన్టీర్ కెరీర్ గ్రాఫ్ ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. Also Read: ఇదిలా ఉంటే, నేడు (మే 20న) ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈరోజు ఆయన తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, రాఘవేంద్రరావు, రాజమౌళి కీరవాణి, సుధీర్‌బాబు, సాయి ధరమ్ తేజ్, సమంత, రామ్ పోతినేని, ఎస్.ఎస్.కార్తికేయ, కౌశల్ మండ ఇలా చాలా మంది ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
from https://ift.tt/2LIU1hh
No comments:
Post a Comment